పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. భోజనప్రితి

"భోజనప్రీతి అనే అధ్యాయంలో కొన్ని అంశాలను చెప్పాం. అక్కడ చెప్పని అంశాలను ఇక్కడ వివరిస్తున్నాం.

భగవంతుడు నరుల ప్రాణాలను నిలిపేందుకు భోజనాన్ని దయచేసాడు. మనం ఆ భోజనాన్ని మక్కువతో ఆరగించేందుకు దానిలో రుచినిగూడ పెట్టాడు. కాని నరులు మితిమిరి తింటారు, తాగుతారు. దీనివల్ల చాల అనర్ధకాలు కలుగుతాయి. అనారోగ్యం తెచ్చుకొంటాం. శరీరం ఆత్మకు లొంగదు. కనుక భోజనం విషయంలో మనం మితత్వాన్ని పాటించాలి. అనగా మన ఆరోగ్యానికీ పనికీ అవసరమైనంతగా మాత్రమే భుజించాలి. అతిగా తిని రోగాలు తెచ్చుకోవడంగాని, మత్తెక్కి తిరగడంగాని పనికిరాదు.

ఉపవాసం, శుద్ధభోజనం

ప్రాచీన కాలంనుండి క్రైస్తవ సమాజం ఉపవాసాన్నీ శుద్ధభోజనాన్నీ పాటిసూ వస్తూంది. భోజనం విషయంలో మితత్వాన్ని పాటించే మార్గాల్లో ఇదొకటి. ఉపవాసంవల్ల కామవాంఛలు తగ్గి శరీరం అదుపులోకి వస్తుంది. జపతపాలు మొదలైన ఆధ్యాత్మిక విషయాలమీద భగవంతునిమిూద కోరిక పడుతుంది. మన పూర్వపాపాలకు పరిహారం చేసికొని వరప్రసాదాన్ని అధికాధికంగా పొందుతాం. తపస్సుకాలంలో వచ్చే ఓ పూజ ప్రార్థన ఈలా వాకొంటుంది. "ఓ ప్రభూ! విూరు ఉపవాసంద్వారా మా దురుణాలను అణచివేస్తున్నారు. మా మనస్సును ఉన్నతానికి త్రిప్పతున్నారు. పుణ్యాన్నీ దాని బహుమానాన్ని మాకు దయచేస్తున్నారు". ఉపవాసంవల్ల ఇన్ని లాభాలు కలుగుతాయి.

ఉపవాసమంటే నిండుగాగాక కొద్దిగా భుజించడం. కొంత ఆకటితో వుండిపోవడం. శుద్ధభోజనమంటే మాంసాహారాన్ని వర్ణించడం. సంవత్సరం పొడుగునవచ్చే శుక్రవారాల్లోను, తపస్సు కాలంలోను ఉపవాసాన్నీ శుద్ధభోజనాన్నీ పాటించడం తిరుసభ సంప్రదాయం. ఈ దినాలు విశేషంగా క్రీస్తు శ్రమలను జ్ఞప్తికి తెచ్చేవి. ప్రస్తుత నియమాల ప్రకారం మనం విబూది బుధవారంనాడు, పెద్ద శుక్రవారంనాడు శుద్ధ భోజనాన్నీ ఉపవాసాన్నీ గూడ పాటించాలి. అన్ని శుక్రవారాల్లోను శుద్ధభోజనాన్ని పాటించాలి. 15వ యేటి నుండి జీవితాంతం వరకు శుద్ధ భోజన నియమాన్ని పాటించాలి. 18వ యేటినుండి ఉపవాస నియమాన్ని పాటించాలి. వ్యాధిగ్రస్తులు మొదలైనవాళ్ళకు ఈ నియమాలు వర్తించవు.

బైబులు దృష్టాంతాలు

యూదులు కష్టాల్లో జిక్కి భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరినపుడల్లా ఉపవాసం చేసేవాళ్లు. మోషే, దానియేలు అన్నా యూదితు మొదలైనవాళ్ళంతా యిలా చేసినట్లు చదువుతున్నాం. యోవేలు గ్రంథం ఈలా చెప్మంది .