పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. లౌకిక రంగంలో ధైర్యసాహసాలు కలవాళ్ళు మంచిపేరు కోసం ఎన్నిశ్రమలైనా అనుభవించడానికి సిద్ధంగా వుంటారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలోకూడ. క్రీస్తుపట్ల .గాడమైన ప్రేమగలవాళ్ళ ఆ ప్రభువు కోసం బాధలనుభవించడానికి తయారుగా వుంటారు. తామూ ఆ ప్రభువులాగే నిందావమానాలూ వేదనలూ, చివరకు మరణాన్ని గూడ అనుభవించడానికి జంకరు. గురువుకొకత్రోవా శిష్యుడికింకొకత్రోవా లేదని వాళ్లకు బాగా తెలుసు. జీవితంలో మన పాలబడిన కష్టాలను అనుభవించడంవేరు. క్రీస్తుపట్లగల ప్రేమచే అతని కష్టాలు మనకుకూడ రావాలని కోరుకోవడం వేరు. పునీతులు చాలమంది ఈలా కోరుకొన్నారు. ఈ కోరిక అరుదైన భాగ్యం.

5. ఆత్మశోధనం

1.మతవిషయాల్లో నీకు మామూలుగా ధైర్యమెక్కువా లేక పిరికితనమెక్కువా? నీవు నీకంటె అధికులను జూచి భయపడుతుంటావా?
2. నీకు ఇతరులు ఏమనుకొంటారో అనే బెరుకు ఎక్కువగా వుంటుందా?
3. నీవు ఇతరుల విమర్శకూ ఎగతాళికీ భయపడి నీవు చేపట్టిన మంచి కార్యాలను వదలివేస్తుంటావా?
4. నీలో దుడుకుతనం తొందరపాటు అనే దుర్గుణాలు కన్పిస్తుంటావా?
5.నీవు ఓర్పుగలవాడివేనా? కష్టాల్లో దైవచిత్తానికి లొంగుతూంటావా లేక దేవుని విూద తిరగబడి అతన్ని నిందింస్తూంటావా?
5.నీవు ఇతరుల కేదైన సేవచేయడంలోగాని, ఓ మంచి కార్యానికి విరాళాలీయడంలో గాని ఔదార్యాన్ని ప్రదర్శిస్తుంటావా? ప్రజలు నిన్ను ఉదారహృదయుడ్డిగా గణిస్తారా లేక పిసినిగొట్టుగానో దూబరాఖర్చులు చేసేవాణ్ణి గానో గణిస్తారా?
6.నీ పనుల్లో నీవు వినయంతో దైవబలం విూద ఆధారపడుతూంటావా?
7.ఏదైనా వో సత్కార్యసాధనలో ఆత్మ నీకు ధైర్యాన్ని కలిగించిన అనుభవం నీకేమైనా వుందా?

4. మితత్వం

మితత్వం అంటే యేమిటి?

ఇంద్రియ సుఖాలను అదుపులో వుంచే పుణ్యమే మితత్వం (Temperance). ఈ పుణ్యం విశేషంగా భోజన ప్రీతినీ లైంగిక ప్రీతినీ అదుపులో వుంచుతుంది. ఈ యధ్యాయంలో భోజనప్రీతి, లైంగికప్రీతి అనే రెండంశాలను పరిశీలిద్దాం.