పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవమెట్టు, ఇతరుల అవహేళననూ విమర్శలనూ సహించడం, ఆధ్యాత్మిక భాగ్యాల కొరకు కృషిచేసేవాణ్ణి లోకం పిచ్చివాణ్ణిగా ఎంచుతుంది. అతన్ని విమర్శిస్తుంది. పరిహాసం చేస్తుంది. ఐనా పరలోక భాగ్యాల నాశించేవాడు ఈ విమర్శలను లెక్కచేయడు.

మూడవమెట్టు, స్నేహితులు తన్ను చేయివిడచినా కలత జెందకుండా వుండడం. పారలౌకిక దృష్టికలవాడ్డి ఈ లోకపు విలువల నభిమానించే మిత్రులు మెచ్చరు. అతన్ని పరిత్యజిస్తారు. కాని ఆధ్యాత్మిక మానవునికి ఇహలోక స్నేహితులను సంతోషపెట్టడం కంటె దేవుని సంతోషపెట్టడం మెరుగని తెలుసు. కనుక అతడు ఈ లౌకిక మిత్రులను వదలుకొని దేవుణ్ణి మిత్రుడ్డిగా పొందడానికి సంసిద్దుడౌతాడు. ఈలా ధైర్యమనే పుణ్యం మనలను మెట్టుమిూద మెట్టు ఎక్కించుకొంటూ పైకి తీసికొనిపోతుంది. మనం భయాన్ని పూర్తిగా జయించేలా చేస్తుంది.

ధైర్యానికి చివరిమెట్టు వేదసాక్షి మరణం. వేదసాక్షిగా మరణించడమంటే క్రైస్తవమత విశ్వాసం కొరకు ప్రాణాలు అర్పించడం. ఈ వేదసాక్షి మరణంద్వారా మనం క్రీస్తుని పూర్తిగా అనుకరిస్తాం. అతనిలాగే మనంకూడ ప్రేమతో ప్రాణాలు ధారపోస్తాం. ఐనా వేదసాక్షిగా మరణించే భాగ్యం కొద్దిమందికే అబ్బుతుంది. మనబోటివాళ్ళందరికీ సిద్ధించే భాగ్యం రోజురోజు మన క్రైస్తవ జీవితాన్ని ధైర్యంతో జీవించడం.

సంగ్రహంగా చెప్పాలంటే, క్రైస్తవ మతాచరణంలో ఎదురయ్యే అవరోధాలనూ భయాలనూ ఎదుర్కోడానికి పవిత్రాత్మ మనకు ధైర్యమనే పుణ్యాన్నిస్తుంది. ఈ పుణ్యబలంతో మనం ఓవైపు పిరికితనాన్ని మరోవైపు దుడుకుతనాన్నీ జయిస్తాం.

2. ఔదార్యం, ఓర్పు

ధైర్యానికి సంబంధించిన ఇతర పుణ్యాలు రెండున్నాయి. అవి ఔదార్యం, ఓర్పు. ఔదార్యమంటే దేవునికొరకుగాని తోడి నరులకొరకు కాని గొప్పకార్యాలు చేయడానికి పూడుకోవడం. లోకంలో స్వీయకీర్తి కొరకు గొప్పకార్యాలు చేపట్టేవాళ్ళన్నారు. కాని భగవంతుని మహిమ కొరకు గొప్పకార్యాలు చేసినపుడు మాత్రమే ఔదార్యమనే పుణ్యాన్ని సాధిస్తాం. మఠసభలను స్థాపించిన దోమినికు, ఫ్రాన్సిసు, ఇగ్నేష్యసు మొదలైన భక్తులు ఈ పుణ్యానికి ఉదాహరణం. సమాజానికి గొప్ప సేవలుచేసిన మదర్ తెరేసా మహాత్మాగాంధి మొదలైనవాళ్లు కూడ దీనికి తార్మాణమే.

దైవసేవ కొరకు ప్రజాసంక్షేమం కొరకు విరాళాలీయడంకూడ ఔదార్యమే ఔతుంది. కనుక దేవాలయాలు ఆస్పత్రులు విద్యాసంస్థలు మొదలైనవాటిని స్థాపించడానికి నిధులను సమకూర్చడం గూడ ఔదార్యమే. మనం గొప్పదానాలే చేయనక్కరలేదు. మన ఆర్థిక స్థితినిబట్టి చిన్నదానాలుకూడ జేయవచ్చు. విన్సెంట్ డపాల్ భక్తుడు చిన్నచిన్న విరాళాలతోనే