పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సదుపాయాలను కల్పించడమే సాంఘిక న్యాయం. అనగా వాళ్లు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా పైకి వచ్చేలా చూడాలి. వాళ్ళకు విద్య, ఆరోగ్యం మొదలైన సదుపాయాలన్నీ కల్పించాలి.

అన్ని దేశాల్లోలాగే మనదేశంలో గూడ మీది యిరవైశాతం ప్రజలు భూములు ధనం అపరిమితంగా స్వాధీనం చేసికొని పేదలకు ఏమీ దక్కనీయడంలేదు. దేవుడిచ్చిన సంపదలను కొద్దిమంది కొట్టేసి అధిక సంఖ్యాకుల నోళ్ళల్లో దుమ్ముకొడుతున్నారు. సాంఘిక అన్యాయం ఇక్కడే వుంది.

కూలివానికి అతని వ్యక్తిగతమైన కూలికి మాత్రమే వేతనమిస్తే చాలదు. మనమిచ్చే వేతనం అతని కుటుంబ పోషణకుకూడా సరిపోవాలి.

ఈ దేశంతో క్రైస్తవులమైన మనంకూడ సాంఘిక అన్యాయాల్లో మస్తుగానే పాలుపంచుకొంటాం. క్రైస్తవుల్లోకూడ నిరుపేదలు కాని ఒకపాటి సంపన్నులు చాలమంది వున్నారు. కాని వాళ్లు తమ సొత్తును ఇరుగుపొరుగు నిరుపేదలతో ఏ మాత్రం పంచుకోరు. క్రీస్తు నేర్చిన ప్రేమసూత్రాలను ఏమాత్రం పాటించరు. ఒక్క విషయం చూద్దాం. ఈ దేశంలోని క్రైస్తవులమైన మనకు విదేశాలనుండి విరాళాలు అందుతున్నాయి. కాని మనకా విరాళాలు పంపే విదేశీయులు పేదవాళ్ళ వాళ్ళు మనకంటె ధనవంతు లేమి కాదు. ఐనా వాళ్ళు తోడి పేదలను ఆదుకొంటున్నారు. మనం అలా ఆదుకోవడంలేదు. వాళ్ళు క్రీస్తు ప్రేమసూత్రాలను పాటిస్తున్నారు. మనం పాటించడం లేదు.
భగవంతుడు నరుడ్డి తనకు పోలికగా జేసాడు. నరునికి చేసిన సేవను ఆ ప్రభువు తనకు చేసినట్లే భావిస్తాడు. కడ తీర్పు సామెత భావం యిదే. ఈ సామెత క్రీస్తుబోధల్లో అతిముఖ్యమైంది. కనుక మనం మన శక్తికొలది తోడిపేదలను ఆదుకోవడం నేర్చుకోవాలి. మన క్రైస్తవుల్లోనే ఒక్కోసంపన్నకుటుంబం ఒక్కోపేదకుటుంబాన్ని ఆదుకొంటే ఎంత ఆదర్శవంతంగా వుంటుంది.

5. ఆత్మశోధనం

1. నీవు ఇతరుల వస్తువులను అపహరిస్తుంటావా? 2. నీవు చేసిన బాకీలను సకాలంలో ఖండితంగా తీరుస్తావా? నీకు దొరికిన వస్తువులను సొంతదారులకు ముట్టజెప్పే ప్రయత్నం చేస్తుంటావా? 3. ఇతరులనుండి బదులు తీసికొన్న వస్తువులను జాగ్రత్తగా వాడుకొని సకాలంలో తిరిగి యిచ్చి వేస్తుంటావా? 4. తోడిప్రజలు నిన్ను నమ్మి నీకు డబ్బునుగూర్చిన బాధ్యతలను ఒప్పజెప్తారా? 5. నీవు ఇతరులను గూర్చి చెడ్డగా ఆలోచిస్తుంటావా? వాళ్ళ పనులకు మాటలకు దురుద్దేశాలు అంటగడుతుంటావా?