పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ వొక్క విషయం ఆలోచిద్దాం. ఇతరులకు మన హృదయంలోకి తొంగిచూసే శక్తి, మనం వాళ్ళను గూర్చి చెడ్డగా ఆలోచిస్తున్నామని తెలిసికొనే శక్తివందనుకోండి. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మన దురాలోచనలను అదుపులో బెట్టుకొంటాం! కాని తోడివారు కాకపోయినా దేవుడు నిరంతరం మన హృదయంలోకి చూస్తుంటాడుకదా! మరి మన హృదయంలోని దురభిప్రాయాలను అతడు అంగీకరిస్తాడా?

2) మనం అన్యుని రహస్యలోపాలను వెల్లడి చేయకూడదు. అలాచేస్తే అన్యుడు తన కీర్తిని కోల్పోతాడు. అతనికి తన కీర్తిని నిలబెట్టుకొనే హక్కువుంది. మనమా హక్కుని భంగపరచకూడదు. కొందరు నోటి దురదకొద్ది అన్యుల లోపాలను తాము పొయినకాడల్లా ప్రచారం చేస్తూంటారు. అలా చేయడం తెలివనుకొంటారు. కాని దానివల్ల తోడివారికి ఎంత అపకీర్తి కలుగుతుందో గుర్తించరు. పునీతుల చరిత్రలు పరిశీలిస్తే వాళ్ళు తోడిజనంపట్ల ఎంతో దయతో మెలిగారని తెలుస్తుంది. అన్యల మంచిపేరును కాపాడ్డానికి ఎంతో ప్రయత్నంచేసినట్లు విశదమౌతుంది.

3) ఇక, తోడివారివిూద నిందలూ అపదూరులూ మోపడం ఫనోరమైన పాపం. కొందరు అసూయకొద్దీ తోడివారిమీద పుకార్లు పుట్టిస్తారు. దీనివల్ల మంచివాళ్ళుగూడ చెడ్డవాళ్లుగా చలామణి అయ్యే దుస్థితి పడుతుంది. ఇది క్షమింపరాని నేరం.

4) ఇంకా మనం ఇతరులను అక్రమంగా అవమనాపరచగూడదు. ఇతరులను బహిరంగంగా దూషించడం. వాళ్లమీద చేయి చేసుకోవడం, ఉమ్మివేయడం, చెప్పలు విసరడం మొదలైన కార్యాలకు పాల్పడినప్పడు వాళ్ళను అవమానిస్తాం. ఈలాంటి పనులన్నీ న్యాయాన్ని చెరుస్తాయి.

ఇక, ఇతరుల వస్తువులను అపహరించినపుడులాగే వారి మంచిపేరును చెడగొట్టినపుడుకూడ నష్టపరిహారం చేయాలి. కనుక ఇతరులనుగూర్చిన మన దురభిప్రాయాలూ అబద్దాలూ అపదూరులూ అవమానాలూ మొదలైన వాటికన్నిటికీ మనం క్షమాపణం అడుక్కోవాలి. ఈ కార్యం మనకు సిగ్గును పుట్టిస్తుంది. అయినా తప్పదు. నోటిదురుసువల్ల మనం ఇతరులకు ఎంత అపకీర్తి కలిగించామో గ్రహిస్తే ఈలాంటి సిగ్గును తేలికగానే సహించవచ్చు. భవిష్యత్తులో ఈలాంటి పాపాలనుండి వైదొలగవచ్చుకూడ అసలు పవిత్రతమీద మక్కువ కలవాళ్ళ న్యాయంతోబాటు సోదరప్రేమనుగూడపాటిస్తారు. అప్పడు ఇతరులపట్ల దయతో సానుభూతితోను మెలగవచ్చు.

4. సాంఘిక న్యాయం

సాంఘిక న్యాయాన్ని గూర్చి ఒకటి రెండు భావాలైనా చెప్పకుండా ఈ యధ్యాయాన్ని ముగించకూడదు. నేడు అన్నిటికన్నా ఈ న్యాయాన్ని ముఖ్యమైనదాన్నిగా గణిస్తున్నారు. ముందే చెప్పినట్లు, పేదప్రజలు గౌరవప్రదంగా జీవించడానికి అనువైన