పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. న్యాయం

1. న్యాయం అంటే ఏమిటి?

ఇతరుని హక్కును గుర్తించి అతనికి ముట్టవలసింది అతనికి ముట్టేలా చేయడమే న్యాయం. ఉదాహరణకు కూలివాడికీయవలసిన కూలి అతనికి ముట్టజెప్పాలి. అధికారికి చెందవలసిన గౌరవం అతనికి అందజేయాలి. తోడివాడు గోప్యంగా వుంచదలచుకొన్న రహస్యాన్ని గోప్యంగా వుంచాలి.

వివేకం ప్రధానంగా బుద్ధిశక్తికి సంబంధించినదయితే, న్యాయం ప్రధానంగా చిత్తశక్తికి సంబంధించింది.

న్యాయం వేరు, సోదరప్రేమ వేరు. న్యాయంలో ఇతరుని హక్కుని గుర్తిస్తాం. అతని కీయవలసింది అతనికిస్తాం. సోదరప్రేమలో ఇతరుని దేవుని బిడ్డనుగాను క్రీస్తుకి సోదరుని గాను మనకు సోదరునిగాను గుర్తించి అతన్ని ఆదుకొంటాం. న్యాయంకంటె సోదరప్రేమ విస్తృతమైంది. కాని న్యాయంలో గూడ ప్రేమ వుండాలి. సోదరప్రేమను ఆచరణలో పెట్టినపుడు న్యాయాన్ని పాటిస్తాం. ఉదాహరణకు అక్కరలో వున్న పేదవాణ్ణి పట్టించుకొంటే అతనిపట్ల ప్రేమ చూపినట్ల, ఆ ప్రేమే న్యాయంకూడ ఔతుంది.

న్యాయం చాలా రకాలుగా వుంటుంది. ఇక్కడ కనీసం నాలు రకాల న్యాయన్నయినా గుర్తించాలి. మొదటిది, పౌరులు దేశంపట్ల భక్తిచూపి ప్రభుత్వం అమలుపరచే చట్టాలను పాటించాలి. ఉదాహరణకు పన్నులు చెల్లించాలి. రైళ్ళలో టిక్కెట్లతోనే ప్రయాణం చేయాలి.

రెండవది, దేశం ప్రజలు శ్రేయస్సుకోరి వాళ్ళకు మేలు కలిగేలా పరిపాలించాలి. అనగా ప్రభుత్వం ఎవరి ఆదాయానికి తగినట్లుగా మాత్రమే వారికి పన్ను విధించాలి. వ్యక్తుల సామర్థ్యానికి తగినట్లుగా వారిని ఉద్యోగాల్లో నియమించాలి.

మూడవది, నరుడు తోడి నరుని హక్కులను మన్నించాలి. కనుక మనం తోడినరుని సౌత్తను అపహరించకూడదు. అపదూరులు మోపి అతని కీర్తిని చెడగొట్టకూడదు.

నాల్గవది, కలిమికలవారు అక్కరలోవున్న పేదసాదలను ఆదుకోవాలి. వారికి జీవించడానికి అవసరమైన కూడుగుడ్డ యిల్లవాకిలి మొదలైన కనీసపు సదుపాయాలను కలిగించాలి.ఈ నాల్గవరకపు న్యాయాన్నేనేడు "సాంఘిక న్యాయం" అని పిలుస్తున్నారు. నేడు ప్రపంచంలో దీన్ని అతిముఖ్యమైన దాన్నిగా ఎంచుతున్నారు. పేదప్రజల ఆర్థికసాంఘిక పరిస్థితులను మెరుగుపరచడానికి కృషిచేస్తున్న విమోచనోద్యమాలన్నీ ఈసాంఘికన్యాయం కోసమే శ్రమిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో నాల్డింట మూడువంతులు