పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావలి సన్మనస్కులు, అర్చ్యశిష్ణులు మొదలైనవాళ్ళకూడ ఈ పుణ్యార్ధనంలో మనకు తోడ్పడతారు.
వివేకమనే పుణ్యం అందరిలోను ఒకేస్థాయిలో వుండదు. కాని వరప్రసాదస్థితిలో
జీవించే వాళ్లందరిలోను ఈ పుణ్యం చాలినంతగా వుంటుంది. మనం సమాజంలో వివేకవంతుడైన నరుడ్డి గుర్తుపట్టవచ్చు, అతన్ని సలహా అడుగుకోవచ్చుగూడ

5. ఆత్మ శోధనం



1.నీ మాటల తీరు ఏలా వుంటుంది? ఇతరులు నీ మాటల్లో సులభంగా తప్ప పడుతూంటారా? లేక నీ వాగ్లోరణిని మెచ్చుకొంటూంటారా?
2.నీవు తొందరపాటు మనిషివా లేక నిదానంగా ఆలోచించి పనిచేసేవాడివా? నీవు చేసిన పనిని మరొకరు చక్కదిద్దవలసి వుంటుందా?
3.నీవు ఒకసారి చేసిన పొరపాటు మళ్ళా చేయకుండా వుంటూంటావా? అతిగా బాధపడవలసిన పెద్ద పొరపాట్ల చేయకుండా వుంటూంటావా?
4.నీకు ముందుచూప, రాబోయే సమస్యలను ముందుగానే పసికట్టడం, పొదుపరితనం మొదలైన గుణాలున్నాయా?
5.నీవు ఆయా నిర్ణయాలు చేసికొనేపుడు నీ యిష్టానిష్టాలకూ రాగద్వేషాలకూ లొంగిపోతూంటావా లేక న్యాయబుద్ధితో ప్రవర్తిస్తూంటావా?
6.నీవు ఆయా జనంతో మెలిగేప్పడు ముందుగానే వాళ్ళ స్వభావాన్ని గుర్తించి వాళ్ళతో జాగ్రత్తగా మెలుగుతూంటావా? ఇతరులతో తరచుగా తగాదాలు తెచ్చుకోవుగదా?
7.నీవు వ్రాసే జాబులు పదిమంది కంటబడితే నీవు సిగ్గుపడవలసిన అవసరం వుంటుందా?
8. నీవు అవసరం వచ్చినపుడు ఇతరులను సలహా అడుగుతూంటావా లేక అలా అడగటం నామూషి అనుకొంటావా?నీ దగ్గరకి వచ్చేవాళ్ళకు మంచి సలహా యుస్తుంటావా?
9.జనం నిన్ను వివేకవంతుణ్ణిగాను నమ్మదగినవాణ్ణిగాను ఎంచుతారా?
10.దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నట్లుగా నీకేమైనా అనుభవం వుందా? నీ మనసులో మంచి కోరికలు పడుతూంటాయా?