పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపాధ్యాయులు పిల్లలతో మెలిగేపుడూ, సంఘ పెద్దలు జనంతో మెలిగేపుడూ వివేకంతో ప్రవర్తించాలి. లేకపోతే అల్లరిపాలవుతారు. కొందరు మాట్లాడేపుడు ఆచితూచి మాట్లాడతారు. వాళు చెప్పినదానిలో సులభంగా తప్పపట్టలేం. మరికొందరు మూడు మాటలు మాట్లాడితే ఆరు తప్పలు దొర్లుతాయి. మన మాటలు తీరులో జాగ్రత్త అవసరం. ఈలాగే కొందరు ఏపని చేసినా నిదానంగా ఆలోచించి జాగ్రత్తగా చేస్తారు. గ్రుడ్డివాడు కర్రతో తడివి చూచుకొని గాని ముందుకి అడుగుపెట్టడు. నేర్పరియైనవాడి పనితీరు ఈలావుంటుంది. కాని మరికొందరు ఏపని జేసినా పిచ్చిపిచ్చిగాను మూర్ధంగాను చేస్తారు, మళ్లా మరొకరు వచ్చి ఆ పనిని సవరించివలసి వుంటుంది. అసలా పనిని ప్రారంభించకుండా వుంటేనే బాగుండేది అనిపిస్తుంది. ఈలా వివేకవంతులూ మూరులూ భిన్నభిన్నంగా ప్రవర్తిస్తారు.

3. బైబులు దృష్టాంతాలు

పూర్వవేదంలోని సీరా గ్రంథం, సామెతల గ్రంథం మొదలైన విజ్ఞాన గ్రంథాలు వివేకాన్ని మాటిమాటికీ పేర్కొంటాయి. ఈ వుదాహరణలు చూడండి :
"హితోపదేశంలేని ప్రజలు నశిస్తారు
చాలమంది హితోపదేశకులుంటే భద్రత కలుగుతుంది?

- సామె 11, 14


“ఓర్పుగలవాడు వీరునికంటె ఘనుడు
నగరాన్ని జయించడంకంటె తన్ను తాను గెల్వడం మేలు

- సామె 16,32


"జ్ఞాని తగిన సమయం లభించేదాకా మౌనంగా వుంటాడు
కాని గొప్పలు చెప్పకొనే మూర్భనికి ఉచిత సమయం తెలీదు”

- సీరా 20,7.


<poem>"పుణ్యం కోరుకోతగిందైతే
పుణ్యాలన్నీ జ్ఞానంయొక్క కృషినుండే పడుతున్నాయి
మితత్వం, వివేకం, న్యాయం, దైర్యం
మొదలైనవాటినన్నిటినీ జ్ఞానమే మనకు బోధిస్తుంది
ఈ జీవితంలో వీటికంటె విలువగలవేమిూ లేవు"

- సాలోమోను జ్ఞాన 8,7.

కాని ఆ జ్ఞానగ్రంథాలు పేర్కొనేది తరచుగా లౌకిక వివేకం. మన దేశంలో పంచతంత్రం మొదలైన నీతిగ్రంథాలు కూడ ఈ లౌకిక వివేకాన్ని విరివిగా ప్రచారం