పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. నీవు నీ ప్రధాన వృత్తితోపాటు నీ కిష్టమైన చిన్నతరహా పనులను గూడ (హాబీలు) ఒకటి రెండు చేపట్టవచ్చు గదా?
7. ఆటంకా లెదురైనపుడు పట్టుదలతో నీవు చేపట్టిన పనిని కొనసాగిస్తూంటావా లేక దాన్ని సులభంగా వదలివేస్తుంటావా? నీవు చేపట్టిన కార్యం విజయవంతం కానపుడు నిరుత్సాహభావాలకు లొంగిపోవుకదా?
8. చక్కగా పనిచేసినపుడు అంతరాత్మ ఓ విధమైన సంతృప్తిని కలిగిస్తుంది. ఈ యనుభవం నీకేమైనా వుందా?
9. ఒకవేళ నీవు కష్టపడి పనిచేసేవాడివైతే, అందరూ నిన్ను మెచ్చుకోవాలని కోరుకొంటావా? అలా మెచ్చుకోకపోతే నిరుత్సాహపడుతూంటావా?
10. నీ డప్ప నీవు వాయించుకొంటూంటావా? నీ బూర నీవు ఊదుకొంటూంటావా?

7. దురాశ

1. దురాశ అంటే యేమిటి?

ఈ లోకవస్తువులను మితంమిూరి కూడబెట్టుకోవాలని కోరుకోవడమే దురాశ, దురాశని అర్థం చేసికోవాలంటే ఒక మూలసూత్రాన్ని బాగా గ్రహించాలి. భగవంతుడు ఈ లోకవస్తువులను మన లాభానికీ, ఇతరుల లాభానికీగూడ దయచేసాడు. కాని మనం వాటిని కేవలం మన లాభానికి మాత్రమే వాడుకోజూస్తాం. వాటిని కేవలం మనమే దక్కించుకోజూస్తాం. దురాశ ಇక్కడే వుంది.

భగవంతుడు లోకవస్తువులను నరులందరి లాభానికీ ఉద్దేశించాడు. వాటిని వాడుకొని మనం వృద్ధిలోకి రావాలి. వాటి ద్వారా మన శక్తిసామర్ధ్యాలను పెంపొందించుకోవాలి. ఉదాహరణకు, భూమి ఆహారపదార్థాలు జలం విద్యుత్తు డబ్బు మొదలైన వాటిని మనం నిరంతరంర వాడుకొంటూంటాం. ఈ వస్తువులు లేందే మన మనుగడ సాగదు. కాని ఈ వస్తువులను మనం పూర్తిగా మన సాంతం చేసికోగూడదు. వాటిని మనకు కావలసినంతగా వాడుకొని మిగిలిన భాగాన్ని తోడి ప్రజలకు వదలివేస్తుండాలి. అసలు మనకు లోక వస్తువులను వాడుకొనే హక్కు వందేగాని వాటివిూద యాజమాన్యం. నెరపే హక్కు లేదు. వాటిమీద యాజమాన్యం కలవాడు దేవుడొక్కడే ఐనా మనం దుర్బుద్ధివల్ల లోకవస్తువులమిూద సులభంగా యాజమాన్యం నెరపబోతాం. వాటిని మితంమీరి కూడబెట్టుకోబోతాం. వాటిని పూర్తిగా మనం వశం చేసికోబోతాం. వాటిని ఇతరులకు, విశేషంగా పేదసాదలకు, దక్కనీయం. ఉదాహరణకు, నరుడు తనకు కావలసినంత భూమిని మాత్రమే వాడుకొని మిగిలిన నేలను ఇతరులకు వదలివేయాలి. కాని కొందరు