పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవు చనిపోగా నీ దేహం క్రుళ్ళిపోతుందని గ్రహించి దైవాజ్ఞలను పాటించు దేవుని కట్టడలను స్మరించుకొని ఇతరునిమిూద కోపం మానుకో దేవుని నిబంధనాన్ని తలంచుకొని అన్యుని తప్పలను మన్నించు - సీరా 28,1-7. 4) ఇష్టులారా! విూరు పగతీర్చుకోక దాన్ని దేవుని ఆగ్రహానికే వదలివేయండి. పరిశుద్ధ గ్రంథం ఈలా చెప్తుంది : నీ శత్రువు ఆకలిగొనివుంటే వాని యాకలితీర్చు దాహంగొని వుంటే వాని దాహంతీర్చు ఈలా చేస్తే నీవు వానికి సిగ్గు పుట్టిస్తావు

- రోమా 12,19-20.

4. నివారణ మార్గాలు

కొన్నిసారులు శరీరారోగ్యం సరిగా లేకపోవడంవల్లా బాగా అలసిపోయి వుండడంవల్లా సులభంగా కోపం వస్తుంది. అప్పుడు తగినంత విశ్రాంతి తీసికొని కోపాన్ని అణచుకోవాలి.

కోపస్వభావం కలవాళ్ళు తమ దురుణాన్ని ఓ కంట కనిపెడుతూండాలి. ఆ కోపాన్ని గూర్చి ముందుగానే ఆలోచించుకొనివుండి దానికి లొంగిపోకుండావుండే ప్రయత్నం చేయాలి. కోపం వచ్చిన వెంటనే దాన్ని అదుపులో పెట్టుకోవాలి. పెద్ద పులులు సింహాలు మొదలైన వన్యమృగాలకు తర్ఫీదు ఇస్తుంటాం. మనకు మనం తర్ఫీదు ఇచ్చుకోవడం అంత కష్టంకాదు. ఫ్రాన్సిస్ డిసేల్స్ భక్తుడు ఇరవైయేండ్లు కృషిచేసి తన కోపాన్ని అణచుకొన్నాడు.

ఒకోసారి మన క్రింద పనిచేసేవాళ్ళల్లో కొందరు వట్టి అసమర్థులు వుంటారు. వాళ్ళ మనం ఒప్పజెప్పిన పనిని సంతృప్తికరంగా చేయలేరు. అందువలన మనకు చిరాకు కలిగి కోపం వస్తుంటుంది. కాని ఈలాంటి సందర్భాల్లోకూడ మనం స్ప్రిమితంగా ఆలోచించి చూచుకొని మన ఆగ్రహాన్ని అణచుకొంటూండాలి. మన క్రింద పనిచేసేవాళ్ళకి శక్తి చురుకుదనమూ, తెలివీ లేకపోవచ్చు. కనుక మనం వాళ్ళను దయదల్చి వదలివేయాలి, వాళ్ళనుండి అధిక కృషిని ఆశించగూడదు. వాళ్ళను తిట్టుకొంటూ కోపతాపాలకు గురైనందున ప్రయోజనం కలుగదు.

కొందరు ఇతరులు పూర్వం తమకు చేసిన అపకారాలూ అన్యాయాలూ మనసులోకి తెచ్చుకొని వాటిని గూర్చి సుదీర్ఘంగా ఆలోచించుకొంటూ కూర్చుంటారు. ఈ తలంపులవల్ల కోపతాపలకూ ఆవేశాలకూ గురౌతుంటారు. ఇది చెడ్డ పద్ధతి. ఇతరులు