పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ దుష్టుని పన్నాగం. ఐనా జ్ఞానులు అతని వద్దకు తిరిగి రాలేదు. కనుక హెరోదుకి శివమెత్తి బేల్లెహేముకి చుట్టుపట్లగల మగబిడ్డల నందరినీ చంపించాడు - మత్త 2.1-8.

5. క్రీస్తు అద్భుతాలను చూచి యూదనాయకులు అసూయ చెందారు. అతడు విశ్రాంతిదినాన గూడ అద్భుతాలు చేయగా వాళ్లు పండ్లు పటపట గొరికారు. వెర్రికోపంతో అతన్ని సంహరించడానికి కుట్రలు పన్నారు — లూకా 6,6-10,

6. హెరోదురాజు తన సోదరుని భార్యయైన హెరోదియాను చేపట్టాడు. నీవు సీసోదరుని భార్యను ఉంచుకోవడం ధర్మంకాదని స్నాపక యోహాను అతన్ని గద్దించాడు. అందువలన హెరోదియా యోహానుమిూద పగబట్టి అతని అంతుచూడ గోరింది - మార్కు 6,18-19.

7. సైఫను ధర్మశాస్త్రం వలనగాని యెరూషలేము దేవళంవలనగాని రక్షణం కలుగదని బోధించాడు. ఈ బోధకు ఆగ్రహంచెంది యూదనాయకులు సైఫనుని రాళ్లతో కొట్టి చంపారు - అచ 7,54.

8. 1)మూరుడు అవమానాన్ని పొందగానే
కోపాన్ని ప్రదర్శిస్తాడు
కాని మతిమంతుడు తనకు కలిగిన
అవమానాన్ని లెక్కజేయడు - సామె 12, 16.
2) ఓర్పుగలవాడు వీరునికంటె ఘనుడు
నగరాన్ని గెల్వడం కంటె
తన్నుతాను గెల్చుకోవడం లెస్స - 16,32.
3) ప్రభువు మన పాపాలను గమనిస్తాడు
పగతీర్చుకొనే వాడిమిూద అతడు పగ తీర్చుకొంటాడు
నీవు తోడి నరుని అపరాధాలను మన్నిస్తే
నీవు మొరపెట్టినపుడు దేవుడు నీ యపరాధాలు మన్నిస్తాడు
నీవు తోడి నరునిమిూద కోపంగా వుంటే
నిన్ను క్షమించమని భగవంతుణ్ణి ఏలా అడగ్గలవు?
తోడి నరుడ్డి మన్నించనివాడు
తన తప్పిదాలను మన్నించమని
దేవుణ్ణి యేలా వేడుకోగలడు?
నరమాత్రుడైనవాడు కోపాన్ని అణచుకోలేకపోతే
ఇక అతని తప్పిదాలను ఎవడు మన్నిస్తాడు?
నీవు చనిపోతావని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగ నణచుకో