పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. కోపంలోని దుష్టత్వం

ఓర్పుని కోల్పోవడం, తాత్కాలిక కోపం ఇవన్నీస్వల్ప పాపాలు మాత్రమే. ద్వేషంగా మారిన కోపం చావైన పాపమౌతుంది.

క్రోధంవల్ల శాంతి అంతరించి వైరాలు పెరుగుతాయి. ఆస్తినష్టమూ హత్యలూ జరుగుతాయి. ఇంకా దానివల్ల పరదూషణా పగా ప్రతీకారచర్యా చోటుచేసికొంటాయి. ఇవన్నీ పెద్ద అనర్గాలు.

కోపం వచ్చినపుడు మనకు విచక్షణాజ్ఞానం నశిస్తుంది. బుద్ధిశక్తి మందగిస్తుంది. ఏది మంచో, ఏది చెడ్లో తెలియదు. పశుప్రాయమైన ఆవేశానికి గురౌతాం. క్రూరంగా ప్రవర్తిస్తాం, న్యాయాన్ని మిూరుతాం. చిత్తశాంతి అంతరిస్తుంది, మానసికారోగ్యాన్ని కోల్పోతాం. కావననే సీరా గ్రంథం "అసూయ కోపం ఆయుస్సుని తగ్గిస్తాయి" అని చెప్పంది. - 30,24.

ప్రజాకవి వేమన

"కోపమునను ఘనత కొంచెమైపోవును
కోపమునను మిగుల గోడు జెందు
కోప మడచెనేని కోరిక లీడేరు?

అని చెప్పాడు. నీతుకోవిదుడైన సుమతీశతకకారుడు కూడ

"తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష"

అని పల్మాడు. కోపిని జనం మెచ్చరు. ప్రజలు చిర్రుమర్రులాడేవాని దగ్గరికి రావడానికి జంకుతారు. అందుచే మనం ఈ దుర్గుణాన్ని జయించాలి.

3. బైబులు దృష్టాంతాలు

1. దేవుడు తమ్ముని కానుకను స్వీకరించి తన కానుకను నిరాకరింపగా కయీనుకి కోపం వచ్చింది. అతడు ఆగ్రహంతో గ్రుడ్డివాడైపోయి తమ్ముణ్ణి హత్య చేసాడు - ఆది 4,3-8. 2. యేసావుకి రావలసిన తండ్రి దీవెనను యాకోబు కొట్టివేసాడు. కనుక యేసావు యాకోబుమిూద పగబట్టి అతని తిత్తి తీయాలనుకొన్నాడు - ఆది 27,41. 3. రాజకీయోద్యోగులంతా హామానుకి కాలువంచి దండం పెట్టేవాళ్ళు యూదుడయిన మొర్దేకయి మాత్రం అలా చేయలేదు. అందుచేత హామాను అతనిమిూద మండిపడ్డాడు. అతని చంపించాలని కుట్రలు పన్నాడు - ఎస్తేరు 3,5. 4. హెరోదు జ్ఞానులను సాగనంపుతూ వాళ్ళు తిరిగి తన అస్థానానికి రావలసిందిగా కోరాడు. వాళ్లనుండి క్రీస్తుశిశువు వివరాలు తెలిసికొని అతన్ని వధించాలని