పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలవాళ్ళు తమ శక్తికి మించి కార్యాన్ని సాధించగలమని భావిస్తారు. అనగా వీళ్ళు తమ్ముతాము అతి ఘనంగా అంచనా వేసికొంటారు. కొందరు తమకు చేతగానిపని చేయబోయి వెల్లకిల బడతారు. మరికొందరు తాము చాల తెలివైన వాళ్ళమని తలుస్తారు తాము పొరపాటుపడవచ్చునని సందేహించనే సందేహించరు. ఇంకాకొందరు మంచిచెడ్డలన్నీ తమకే తెలుసు అనుకొంటారు. ఇతరులను సంప్రతించనే సంప్రతించరు. కడన పప్పలో కాలువేస్తారు. వేరుకొందరు తాము చాలా పుణ్యాత్ములం అనుకొంటారు. కాని లోకం వాళ్ళ బలహీనతలను నిత్యం గమనిస్తూనే వుంటుంది.

రెండవది, కీర్తి కాంక్ష దీనివల్ల మనం పదవి, పలుకుబడి, గొప్ప పేరు మొదలైన వాటిని ఆశిస్తాం, ప్రతి నరుల్లోను ఈ కోరికలు కొంతవరకైనా వుంటాయి. రాజకీయాలు కీర్తికాంక్షలమిూదనే ఆధారపడివుంటాయి. చాలమందికి జీవితధ్యేయం కీరే. ఆ మాటకొస్తే తిరుసభలోని అధికారుల్లోను ఈ దురుణం అరుదేమి కాదు. ఈ యవలక్షణం వల్ల మనం మన తాహతును మించి కీర్తిని పొందాలని కోరుకొంటాం. దేవుని మహిమ కొరకు గాక మన మహిమకొరకే దాన్ని సంపాదించాలని అభిలషిస్తాం. ఇతరులకు రావలసిన కీర్తిని గూడ మనమే దక్కించుకో జూస్తాం.

మూడవది, ఇతరుల పొగడ్డలకు అర్రులు చాచడం. ఈ దురుణం కలవాళ్ళు జనులు దేవునికంటెగూడ తమ్ము అధికంగా పొగడాలని కోరుకొంటారు. కొందరు తమ రూపాన్నీ అలంకరణనూ దుస్తులనూ చూచి లోకం తమ్ముకొనియాడాలని కోరుకొంటారు. ఇంకా కొందరు తమ శక్తిసామర్థ్యాలనూ ఉద్యోగాన్నీ ధనాన్నీ పెద్దకులాన్నీ చూచి ఇతరులు తమ్ము మెచ్చుకోవాలని అభిలషిస్తారు. వేరుకొందరు తాము సాధించిన విజయాలకు జనులు తమ్మ పొగడాలని ఉబలాటపడతారు. ఇవన్నీ అవివేకపు కోరికలని వేరుగా చెప్పనక్కరలేదు. ఈ పొగడ్డవిూది ప్రీతివలననే ప్రజలు తమ్ముగూర్చి తాము గొప్పలు చెప్పకొంటారు. ఇతరులు మమ్మ మెచ్చుకోకపోతే మమ్మ మేమే మెచ్చుకొంటాం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. నటన చేస్తారు. వేషాలు వేస్తారు, అనగా తాము యథార్థంగా వున్నదానికంటె గొప్పవాళ్ళుగా కన్పించి ఇతరుల ప్రశంశలు అందుకోవాలని చూస్తుంటారు. ఈ తాపత్రయాలకు అంతే లేదు.

3. గర్వంలో ని దుష్టత్వం

అన్ని పాపాలకంటె గర్వం గొప్పది. ఎందుకంటే గర్వంవలన దేవునికి ఎదురుతిరుగుతాం. దేవుని నుండి పొందిన లాభాలను మనమే స్వయంగా సాధించినట్లుగా భావిస్తాం. మన గమ్యం కూడ మనమే అన్నట్లుగా ఎంచుతాం. వేదాంతి తోమాసు అక్వినాసు చెప్పినట్లుగా, అన్ని పాపాలు దేవునినుండి పారిపోజూస్తాయి. కాని ఈ పాపం మాత్రం దేవుణ్ణి ఎదురిస్తుంది. కనుక పూర్ణగర్వం ఎప్పడు కూడ చావైన పాపమౌతుంది.

169