పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలి మానవుల్లో దేవుని పోలిక వుండేది. కాని అతని పాపంద్వార ఈ పోలిక మాసిపోయింది. క్రీస్తు మరణంద్వార దేవుని యిూపోలిక మళ్లా మానవుల్లో నెలకొంటుంది. నూత్నవేద ప్రజలమైన మనలోను జ్ఞానస్నానంతోనే క్రీస్తుపోలిక నిలుస్తుంది. చిత్రకారుడు గోడమీదబొమ్మను చిత్రిస్తాడు. ఆలాగే ఆత్మ మన హృదయాల్లో క్రీస్తురూపాన్ని చిత్రిస్తుంది. కావున మనం క్రీస్తును పోలివుండాలనీ, క్రీస్తు రూపురేఖలు మన హృదయంతో ప్రస్ఫుటం కావాలనీ ఆయాత్మను అడుగుకుందాం.

29. ఆత్మతో నిండి వుండాలి - ఎఫే 5, 18

పాత్ర జలంతో నిండివుంటుంది. ఆలాగే ఆధ్యాత్మిక మానవుడూ ఆత్మతో నిండివుండాలి. మత్తులు మద్యంతో నిండివుంటారు. అలాకాకుండ క్రైస్తవుడు ఆత్మతో పూరింపబడి వుండాలి. పూర్వవేదంలోని ప్రవక్తలు ఆత్మతో, ఆత్మావేశంతో నిండివుండేవాళ్లు. ఈలా ఆత్మతో నిండినవాడు పసివాడు కాడు. క్రీస్తులోనికి ఎదిగినవాడు - ఎఫే 4, 15. పరిపూర్ణమానవుడన్నా, ఆధ్యాత్మిక మానవుడన్నా అతడే - గల 6,1.

ఆత్మతో నిండినవాళ్ళ సంతోషంతో ప్రభువును గానంచేస్తూంటారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తుంటారు. తోడివారిని ఆదరిస్తుంటారు - ఎఫే 5, 19-21.

కాని హృదయాన్ని ఆత్మతో నింపుకోవడం ఎలా? పాత్రను పాలతోనింపాలి అంటే ముందుగా దానిలోని నీళ్లను పారబోయాలి. ఆమీదట ఖాళీఅంతా నిండేలా దాన్ని పాలతో నింపాలి. ఆలాగే మన హృదయాన్నీ ఆత్మతో నింపుకోవాలి అంటే, మొదట హృదయంలోని పిశాచాన్ని ਕੇਹੇਕੇ੪੦ నిర్మూలించాలి. ఆపిమ్మట ఏఖాళీ మిగలకుండా హృదయాన్ని పూర్తిగా ఆత్మతో నింపుకోవాలి, ఆత్మ మన హృదయమనే పాత్రలో నిండుకొని వండాలని మనవి చేద్దాం.

30. మన బాధ్యతలు

మనం పుట్టి జ్ఞానస్నానం పొందేది మొదలుకొని చనిపోయి మోక్షంలో అడుగువెట్టిందాకా ఆత్మ వెట్టిచాకిరి చేస్తుంది. మనపట్ల దాదిలా మెలగుతుంది. అందుకే గ్రీకు పితృపాదులు ఈ యాత్మను తల్లిలేక దాది అని పిలచేవాళ్ళు అనగా ఓ తల్లిగా ఈయాత్మ మనలను సాకుతుంది. ఓ దాదిలా పెంచి పెద్దజేస్తుంది. తెరచాప పడవను నడపించుకొని పోయినట్లుగా మనలనూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించుకొని పోతుంది.