పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనగా తన ఆత్మను ప్రవేశపెట్టాడు. వెంటనే ఆ మృతదేహంగూడ జీవించింది. అనగా క్రీస్తు జీవంతో లేచాడు. ఆదాము జీవించే ప్రాణి అయ్యాడు. అనగా తాను జీవించాడు. తన భౌతిక జీవితాన్ని నరజాతికి అందించాడు. కాని రెండవ ఆదాము క్రీస్తు జీవించటం మాత్రమేగాదు, జీవమిచ్చే ప్రాణిగాగూడ తయారయ్యాడు. ఆ తొలి ఆదాము నరజాతికి భౌతిక జీవితాన్నిఅందిస్తే ఈ రెండవ ఆదాము ఆధ్యాత్మిక జీవితాన్ని అందిస్తాడు. మనం దివ్యజీవితం జీవించేలా చేస్తాడు.

మృతక్రీస్తు ఉత్తాన సమయంలో పరిశుద్దాత్మను పొందాడు. ఆత్మ అనుగ్రహించే జీవితంతో నిండిపోయాడు. అందుకే పాలు "ప్రభువే ఆత్మ" అని వ్రాసాడు - 2కొ 3,17. క్రీస్తు పరిశుద్ధాత్మగా మారిపోయాడనిగాదు ఆ వాక్యోద్దేశం, పరిశుద్ధాత్మ ప్రసాదించే జీవశక్తితో నిండిపోయాడని భావం. ఇక, తాను పొందిన ఆత్మను క్రీస్తు మనకూ అనుగ్రహించాడు. క్రీస్తు నుండి ఆత్మను పొందుతాం. ఈలా పొందిన ఆత్మ మనలను మల్లా క్రీస్తువద్దకు చేరుస్తుంది. క్రీస్తుతో జోడిస్తుంది.

జీవమిచ్చే ప్రాణి క్రీస్తు, అతనికి జీవమిచ్చిన పరిశుద్దాత్మ మనకూ జీవశక్తిని ప్రసాదించాలని మనవి చేద్దాం. ఈ జీవశక్తి వరప్రసాదం.

26. మహిమనుండి మహిమను పొందుతాం -2కొ 3,18

మోషే సీనాయి పర్వతంమీదికెక్కి ప్రభువును దర్శించాడు. ప్రభుమహిమ సోకి అతని ముఖం ప్రకాశించింది. ఆ ముఖ వర్చస్సు చూచి యూదులు భయపడిపోయారు. మోషేను సమీపించడానికి జంకారు. అంచేత మోషే ముఖంమీద ముసుగువేసికొని యూదులతో మాటలాడేవాడు - నిర్గ 34, 29–35, ఉత్థాన క్రీస్తు కూడ ఆత్మను పొంది, ఆత్మ మహిమతో ప్రకాశించాడు, జ్ఞానస్నానం ద్వారా క్రీస్తులోనికి ఐక్యమైన మనంగాని క్రీస్తుగాని మోషేలాగ ముఖంమీద ముసుగువేసికోవలసిన అవసరమేమీలేదు. ప్రభువులోనికి ఐక్యమొందిన కొద్దీ, ప్రభువు ఆత్మను పొందిన కొద్దీ, మన ఆత్మలోని వర్ఛస్సుకూడ అధికమౌతుంది. అనగా మనం రోజురోజుకి క్రీస్తురూపాన్ని పొంది క్రీస్తులా జీవిస్తాం.

27. తొలి ఫలాలు, సంచకరువు - రోమ 8,23; 2కొ 1,22

భూమి, పశువులు మొదలైన వానిని కొనేప్పడు బయానా ఇస్తాం, తరువాత పూర్తి సౌమ్మ చెల్లిస్తా మనడానికి ఈ బయానా గుర్తు. బయానా లేక సంచకరువును పుచ్చకొన్న ఆస్తిదారుడు తరువాత పూర్తి సౌమ్మను పొందుతాడు.