పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అండగాను దండగాను వుంటుంది. మనం క్రమేణ ప్రాకృతిక మానవుణ్ణి జయించి ఆధ్యాత్మిక మానవుణ్ణి పెంపొందించుకునేలా చేస్తుంది. కనుక ఈ విషయంలో మనం నిత్యం ఆత్మ సహాయం అడుక్కుంటూ వుండాలి.

15. నైతిక జీవితం - గల 5, 25

మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది క్రీస్తు ఉత్దానంలో పాలు పొందాం. కావున మన జీవితం విశుద్ధంగా వుండాలి. అనగా మనం రోజురోజు నైతిక జీవితం జీవిస్తుండాలి. ఇక, మనం నైతిక జీవితం జీవించే శక్తిని ఇచ్చేది పరిశుద్దాత్మ. ప్రాకృతిక మానవుడు శరీరేచ్చల ప్రకారం నడుస్తూవుంటాడు. ద్వేషం, విభేదం, కలహం, కాముకత్వం మొదలైన దుష్ట గుణాలు శరీరేచ్చలు. నరులు ఈ దుష్ట గుణాలను జయించేలా చేస్తుంది పవిత్రాత్మ - గల 5, 19-21.

ఆయాత్మ తన ఫలాలను గూడ అనుగ్రహిస్తుంది. సంతోషం, శాంతం, ప్రేమ మొదలైనవి ఆత్మ యిచ్చే ఫలాలు, వీనిద్వారా నరుడు ఆధ్యాత్మిక జీవితం జీవిస్తాడు - గల 5,22-23.

మనం శరీరేచ్చల ప్రకారం జీవిస్తున్నామో ఆత్మ ఫలాల ప్రకారం జీవిస్తున్నామో విచారించి చూచుకుందాం.

16. ఆత్మ వరాలు = 1కొ 12, 8-12

ఆత్మ క్రైస్తవ సమాజానికి వరాలు ఇస్తుంది. వ్యాధులు నయంజేసే శక్తి అద్భుతకార్యాలు, ప్రవచనం, బహుభాషాజ్ఞానం మొదలైనవి ఆత్మ దయచేసే వరాలు. మొదటి కొరింతీయుల జాబులోని 12వ అధ్యాయమందంతటా ఈ వరాలు వర్ణింపబడ్డాయి. ఇవన్నీ గలసి ఇంచుమించు 20 వరాలదాక వున్నట్లు తెలుస్తుంది. ఇవి వ్యక్తి లాభం కోసం గాదు, సమాజలాభం కోసం ఉద్దేశింపబడ్డాయి. వీని ద్వార క్రెస్తవ సమాజం బలపడి వృద్ధిలోనికి వస్తుంది.

పై వర్గాల ద్వార వ్యక్తి యేమో ప్రత్యేకంగా పరిశుద్దుడు కాడు. అందుచేత వీటిని అత్యాశతో ఆశించవద్దన్నాడు పౌలు. వీటికంటే మిన్నయైనవి విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే పుణ్యాలు. వీటిల్లోను ప్రేమ శ్రేష్టమైంది. అందుచేత ప్రేమను పెంపొందించు కొమ్మన్నాడు 1కొ 14,1. ఈ మూడు పుణ్యాలు కూడ పవిత్రాత్మ ప్రసాదించే భాగ్యాలే.

ఇంతకు ముందే ఆత్మ ప్రసాదించే ఫలాలను చూచాం. ఇప్పడు ఆత్మ అనుగ్రహించే వరాలను పుణ్యాలను వివరించాం. ఈ ఫలాలు, వరాలు, పుణ్యాలు - వీని