పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అసలు రక్షణమంటేనే వీళ్లకు అపహాస్యంగా వుంటుంది. అంచేత వీళ్ళు క్రీస్తును అంగీకరింపరు – 1కొ 2,14.

రెండవ రకంవాళ్లు, అపరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవితం జీవించేవాళ్లు, వీళ్ళు క్రీస్తును అంగీకరించారు, జ్ఞానస్నానం పొందారు. ఆత్మను స్వీకరించారు, కాని ఆ యాత్మ చెప్పుచేతల ప్రకారం నడచుకోరు. దేహేచ్చల ప్రకారం జీవిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో పెరిగి పెద్దవాళ్లు కారు. ఎప్పడూ చిన్నపిల్లల్లా వుండిపోతారు. బలవర్థకమైన భోజనాన్ని స్వీకరించలేరు. పిల్లలు త్రాగే పాలు త్రాగుతూంటారు. వీళ్లు తమలోని ఆత్మను ఆర్చివేయరుగాని, నిరోధిస్తూ వుంటారు. కొరింతు క్రైస్తవులు ఈలాంటివాళ్లు - కొ 3 , 1–4.

మూడవ రకంవాళ్ళ పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవితం జీవించేవాళ్ళు. వీళ్ళు దేవుని రక్షణ ప్రణాళికను, దేవుని విజ్ఞానమైన క్రీస్తును అర్థం చేసికుంటారు. పరిశుద్దాత్మ చూపించే మార్గంలో నడస్తూంటారు. వీళ్లల్లోను దేహం ఆత్మతో పోరాడుతుంది. కాని వీళ్ళ దేహానికి వశులుకారు. ఆధ్యాత్మిక జీవితంలో వీళ్ళు పిల్లల్లా కాదు, పెద్ద వాళ్లల్లా ప్రవర్తిస్తారు. నిత్యం ఆత్మ ఆధీనంలో వుండి, ఆత్మ ఎటువైపు నడిపిస్తుంటే అటువైపు నడచి పోతూంటారు. కనుక వీళ్ళ ఆధ్యాత్మిక మానవులు అనబడుతారు - 1కొ 2, 15-16.

మనం మొదటి తరగతికి చెందం. మూడవ తరగతికి చెందవలసినవాళ్లం గాని, బలహీనతవల్ల రెండవ తరగతిలోనే వుండిపోతాం. ఆత్మ మనలను మూడవ తరగతికి చెందిన పరిపూర్ణ ఆధ్యాత్మిక మానవులనుగా తయారు చేయాలని ప్రార్ధిద్దాం.

14. దేహాత్మల వైరుధ్యం - గల 5, 16-17 ; రోమ 8,5-6

మనలో ప్రాకృతిక మానవుడూ జీవిస్తుంటాడు, ఆధ్యాత్మిక మానవుడూ జీవిస్తుంటాడు. ఈ యిద్దరకూ నిత్యం ఘర్షణ జరుగుతూంటుంది. ప్రాకృతిక మానవుడు ప్రకృతికి అనుగుణంగా పాప జీవితం జీవింప గోరుతాడు. ఆధ్యాత్మిక మానవుడు ప్రకృతిని అరికట్టి దివ్యజీవితం జీవింప గోరుతాడు. దీన్నే పౌలు "దేహాత్మల వైరుధ్యం" అని పిలుస్తుంటాడు. ఇక్కడ దేహం ప్రాకృతిక మానవుని సూచిస్తుంది. ఆత్మ ఆధ్యాత్మిక మానవుని సూచిస్తుంది. ఇక పరిశుద్దాత్మ మనలోని ప్రకృతి శక్తులను దేహేచ్ఛలను నిరోధిస్తుంది. ఆధ్యాత్మిక శక్తులను ෂබ්නුඹු చేస్తుంది, మనం దివ్య జీవితం జీవించేలా సాయపడుతుంది - రోమ 8, 13.

మనం జీవించినంత కాలం మనలోని ప్రాకృతిక ఆధ్యాత్మిక శక్తులకు అనగా మనలోని దేహాత్మలకు పోరాటం జరుగుతూనే వుంటుంది. ఈ పోరాటంలో ఆత్మ మనకు