పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహిమను ఇక్కడే కొంతవరకు పొందుతాం. పూర్తిమహిమ మరణానంతరం లభిస్తుంది. ఆలా లభిస్తుంది అనడానికి గురు ఈ ముద్ర.

పరలోకపు తండ్రే మన హృదయాల్లో ఆత్మ అనే ముద్రను నిలుపుతాడు. ఇది జ్ఞానస్నాన సమయంలో జరుగుతుంది అన్నాం - ఈ సంస్కారంద్వారా క్రీస్తుతో ఐక్యమౌతాం. ఈ సంస్కారంద్వారా, జలం పాత్రలోలాగ, ఆత్మ మన హృదయాల్లో నిండుకొంటుంది - 1కొ 12, 13.

ఈలా హృదయంమీద నెలకొనివున్న ఈ ముద్రను మనం గౌరవిస్తూవుండాలి. పాపంవలన ఈ ముద్ర విచ్ఛేదమై పోతుంది. ఆలా విచ్చేదమై పోకుండా వుండేలా చూచుకునే బాధ్యత మనదే.

12. ఆత్మ వలన దేవుని పుత్రులమౌతాం - రోమ 8, 14-16

సీనాయి నిబంధనం ద్వారా పూర్వవేదపు యూదులు యావే ప్రజలయ్యారు. కాని ఆ ప్రజలు యావేను తండ్రీ, అని పిలవడానికి భయపడిపోయి "ప్రభూ" అని మాత్రం పిలిచేవాళ్లు, అతడు యజమానుడు. వాళ్లు బానిసలు. యూదులు అతన్ని జూచి జంకేవాళ్లు కనుక అతని పేరైన ఉచ్చరించేవాళ్లుకాదు. ఇక, నూతవేదపు జనులమైన మనంకూడ జ్ఞానస్నానం ద్వారా దేవుని ప్రజలమా తాం, కాని మనం దేవుణ్ణి ప్రభూ అని పిలవడానికి బదులుగా “తండ్రీ" అని పిలుస్తాం. ఈ స్వాతంత్ర్యమూ చనువూ మనకు ఎక్కడనుండి లభించింది? పరిశుద్ధాత్మను పొందడంద్వారానే. ఆ యాత్మద్వారా మనం దేవుని దత్తపుత్రలమౌతాం. క్రీస్తునకు తమ్ముళ్లంగాను చెల్లళంగాను మారిపోతాం. ఆ క్రీస్తులాగే మనంగూడ పరలోకంలోనిపితను "అబ్బా" లేక “తండ్రీ" అని పిలుస్తాం. బిడ్డల్లాగ ఆ తండ్రిని ప్రేమిస్తాం.

పరలోకంలోని తండ్రికి క్రీస్తు సహజ పుత్రుడు. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన మనం ఆ తండ్రికి దత్త పత్రులం. ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన ఆత్మపట్ల ఎంతైన కృతజ్ఞలమై వండాలి.

13. మూడు రకాల నరులు

పౌలు నరులందరిని మూడు రకాలుగా విభజించాడు, మొదటి రకంవాళ్లు ప్రాకృతిక మానవులు. వీళ్లు దేహేచ్చల ప్రకారం ప్రాపంచిక జీవితం జీవించేవాళ్లు, తమో గుణాలతో నిండినవాళ్లు. వీళ్లు ఆత్మను పొందలేదు, ఆత్మ వీళ్లల్లో వసింపదు. ఈ రకంవాళ్లు దేవుని రక్షణ ప్రణాళికను, క్రీస్తును క్రీస్తు చేకూర్చిపెట్టిన పాపవిమోచనాన్ని లెక్కచేయరు.