పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తునాడు యూదుల్లో రెండు వర్గాలుండేవి. పైవర్గం వాళ్ళు పరిసయులూ సదూకయిలూ, వీళ్లు ధనవంతులూ, పదవుల్లో వున్నవాళూ, ధర్మశాస్తాన్ని బోధించేవాళ్ళూ ప్రజలకు నాయకులూను. రెండవవర్గం వాళ్లు సుంకరులు. వీళ్ళ నిరుపేదలూ, పామరులూ, ధర్మశాస్తాన్ని పాటించని పావులూను. అంచేత మొదటి వర్గంవాళ్ళు వీళ్ళను చిన్నచూపు చూచేవాళ్ళు. కాని క్రీస్తు ఈ రెండవవర్గం వాళ్ళకోపు తీసికొన్నాడు. వాళ్ళ యిండ్లల్లో భుజించి, వాళ్ళతో తిరుగుతూ వాళ్ళకు చేరదీయడం మొదలెట్టాడు. అందువల్ల అగ్రవర్గం వాళ్ళకు అతని మీద కన్నుకుట్టింది - లూకా 15, 1-2 ఆవిధంగా అతడు సమాజంలో అట్టడుగున వున్నవాళ్ళని పరామర్శించాడు. అతని శిష్యులంతా ఈ వర్గానికి చెందినవాళ్ళే

క్రీస్తు కథలో ఒకటైన కడతీర్పు సామెత పేదలను ఆదరించాలని చెప్పంది. ఈకథలో ప్రభువు "అత్యల్పులైన నా సోదరుల్లో ఒకనికి మీరు మేలుచేస్తే దాన్ని నాకు చేసినట్లే భావిస్తాను" అన్నాడు – మత్త 25, 40.

క్రీస్తు శిష్యులు సాంఘికన్యాయాన్ని గూర్చిన తమగురువు బోధలను క్షుణ్ణంగా అర్థంచేసికొన్నారు. యెరూషలేములో కరువురాగా పౌలు కొరింతులో చందాలు వసూలు చేసి పంపాడు. అనగా కాటకంవల్ల బాధపడే యూదక్రైస్తవులను గ్రీకుక్రైస్తవులు ఆదుకొన్నారు. 2కొ 9,12-14. ఇంకా యాకోబు తన జాబులో ధనవంతులు పేదలను ఆదుకోవాలని బోధించాడు. “తోడి జనం కూడుగుడ్డకోసం అలమటిస్తుంటే మనం వాళ్ళ అవసరాలను తీర్చాలి, దానికి బదులుగా - దేవుడు మిమ్ము దీవిస్తాళ్లే! మీరు మస్తుగా భుజిస్తూ మంచి బట్టలు ధరిస్తూండండి - అని వట్టి వుపచారవాక్యాలు పలికితే యేమిలాభం?" - 2, 14.

3.నేటి పరిస్థితి. నేడు ప్రపంచంలో ఎక్కడ చూచినా రెండువంతులు పేదలు, ఒకవంతు ధనికులు. పేదలకు రావలసిన సొమ్ముకూడ ఏదో రూపంలో ధనికులకు ముడుతూంది. పెద్ద చేప చిన్న చేపను మింగి తాను ఇంకా పెద్దదైనట్లుగా సమాజంలో ధనికుడు పేదవాడి నోరుకొట్టి తానింకా ధనికుడౌతూంటాడు.

మన దేశంలో ఈ యన్యాయం ఇంకా యొక్కువ. నరుడు రోజూ కనీసం పాతికరూపాయల తిండైనా తింటేనేగాని జీవితయాత్ర సాగించలేదు. కాని ఇండియాలో రోజుకి పాతికరూపాయల ఆదాయంకూడ లేనివాళ్ళ నలబై శాతంమంది వున్నారు. అరవైశాతం మంది వున్నారని కూడ కొందరు చెప్తున్నారు. ఈలాంటి పేదలను ఆర్థికవేత్తలు దారిద్ర్యరేఖకు క్రింద జీవించేవాళ్లు అంటారు.

కూడు గుడ్డా యిలల్లా వాకిలి నోచుకోలేని అభాగ్యులు దేశంలో యింతమందుంటే పెంతెకోస్తు ఉద్యమం సభ్యులంగా మనపూచీ యేమిటి? మనం ప్రార్థనలుచేస్తూ, దయ్యాలనూ వెళ్ళగొడుతూ, భాషల్లో మాటలాడుతూ, పాటలు పాడుకొంటూ వుంటే