పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు అపోస్తలులకుమల్లె మరియకు క్రైస్తవ సమాజంమీద అధికారం ఈయలేదు. ఆమెశక్తి అధికార రంగానికి చెందిందికాదు. మరి ఆధ్యాత్మికమైంది. ఆమెశక్తి ఈనాడు మనమీద రెండు రూపాల్లో పనిచేస్తుంది. మొదటిది, మరియు మనకు ప్రబోధం కలిగిస్తుంది. ఆత్మవశవర్తినియైన మరియ ఈనాడు మనంకూడ ఆత్మకు లొంగివుండాలనీ ఆయాత్మచే నడిపింపబడాలనీ హెచ్చరిస్తుంది. రెండవది, ఆమె మనకోసం విజ్ఞాపనం చేస్తుంది. మోక్షక్రీస్తు మనకోసం విజ్ఞాపనం చేస్తూంటాడు - హెబ్రే 7,25, అతనితో ఐక్యమై మరియ కూడ మోక్షంనుండి మనకోసం విజ్ఞాపనం చేస్తూంటుంది. ఉత్తాపిత మరియ శక్తి అంతా ఈ రెండంశాల్లోనే ఇమిడి వుంది, మరియలాగే పెంతెకోస్తు ఉద్యమంలో చేరిన భక్తులుకూడ భక్తిమంతమైన జీవితం జీవించి ఇతరులకు ప్రబోధం కలిగించాలి. ఇతరులనుకూడ ఆ యాత్మ దగ్గరికి రాబట్టాలి. పైగా వాళ్ళ తోడి జనం కోసం రోజూ విజ్ఞాపనం చేయాలి. 9. దేవుని, ఆత్మ దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తుంది - రోమా 5,5. ఆయాత్మ మరియ హృదయంలో ఈ ప్రేమను కుమ్మరించింది. కనుకనే ఆమె జీవితం ప్రేమమయమైంది. ఆత్మ మనకు సేవా వరాలూ ఫలాలూ ఇస్తుందని చెప్పాం. ఇవన్నీ ప్రేమను పెంపొందించడం కొరకే. కనుక ఆత్మ ఆ మరియ హృదయాన్నిలాగే మన హృదయాన్నికూడ రోజురోజు ప్రేమతో నింపుతుండాలని మనవిచేసికొందాం.

21. సాంఘిక న్యాయం

పెంతెకోస్తు భక్తులకు సామాజిక స్ఫురణం లేదనే అపనింద వుంది. కేవలం ప్రార్థనా సమావేశాలు జరుపుకొని పాటలు పాడకొంటేనే చాలదు. సామాజిక స్ఫురణం కూడ అవసరం. విశేషంగా పేదప్రజలు అసంఖ్యాకమైన అన్యాయాలకు గురై బాధపడే ఈ రోజుల్లో సమాజంలో అట్టడుగున వున్నవారిని ఆదుకోవడం అత్యవసరం. బైబులు భగవంతుడు ఎప్పడు కూడ పేదసాదలను పరామర్శించేవాడు. 1. పూర్వవేదం. పూర్వవేదంలో ప్రభువు ఐగుపున ఫరోకు దాసులై మూల్లుతూన్న యిస్రాయేలు ప్రజను బానిసంనుండి విడిపించాడు. యిప్రాయేలీయులకు జరిగే సాంఘిక అన్యాయాన్ని భరించలేక మోషే అనే నాయకుని ద్వారా ఆ ప్రజను ఐగుప్త నుండి వెలుపలికి నడిపించుకొని వచ్చాడు -నిర్గ 3, 7-9, ప్రభువు మొదట వాళ్ళను రక్షించింది పాపం నుండిగాదు, పరపీడనం నుండి. అటుపిమ్మట ఆ జనం యావే ప్రజలై అతన్ని పూజించారు.