పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. ఆత్మ ప్రభావంవలన మరియ జీవితం క్రీస్తు మీద కేంద్రీకృతమైంది. ఆమె తన సర్వస్వాన్నీ క్రీస్తుకే అర్పించుకొంది. హృదయ పూర్వకంగా క్రీస్తుని ప్రేమించింది. ఆనందంతో అతనికి సేవ చేసింది. నేడు భక్తులందరికీ ఆ క్రీస్తుని అందిస్తూంది.

ఓమారు ఆత్మకు వశులమైపోతే మన జీవితంకూడ క్రీస్తుకు కేంద్రమౌతుంది. ఎప్పడూ ఆత్మ క్రీస్తుని మన జీవితకేంద్రానికి తీసికొని వస్తుంది. మన జీవితాన్నే గనుక ఆత్మ నడిపించినట్లయితే, మన సర్వస్వాన్నీ ఆ ప్రభువుకే అర్పించుకొంటాం. క్రీస్తుకోసం తోడి ప్రజలకు సేవచేస్తాం. స్వార్ణాన్ని జయించి పరోపకారం జీవితం జీవిస్తాం.

6. మరియు తన బంధువైన ఎలిసబేత్తును దర్శించడానికి వెళ్ళింది, వృద్ధాప్యంలో గర్భవతియైన ఎలిసబేత్తుకు పురుడుపోసి సహాయం చేసింది. ప్రభువు తన్ను కటాక్షించిన విధానాన్ని ఆమెకు విన్పించింది. తన కష్టసుఖాలను ఆమెతో చెప్పకొంది — లూకా 1, 39.

ఈలాగే పెంతెకోస్తు భక్తులుకూడ తోడిజనానికి తోడ్పడతారు. ప్రభువు తమకుచేసిన మేలి కార్యాలను తోడి జనానికి తెలియజేస్తారు. “సర్వశక్తిమంతుడు మాకు గొప్ప కార్యాలు చేసాడు" అని తోడిజనం ఎదుట ప్రభుని స్తుతిస్తారు. ఆ ప్రభువు కారుణ్యానికి వేనోళ్ళ సాక్ష్యం పలుకుతారు.

7. మరియ మొట్టమొదట మనకు బైబుల్లో కన్పించేది పరిశుద్దాత్మ నీడలోనే. మంగళవార్త సమయంలో సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించి వుండగానే - లూకా 1, 35. ఆమె కట్టకడన బైబుల్లో కన్పించేదికూడ పరిశుద్దాత్మ నీడలోనే. పెంతెకోస్తు దినాన శిష్యులతో పాటు మరియకూడ ప్రార్ధన చేసూండగా వాళ్ళతో పాటు తానూ ఆత్మను పొందింది - అకా 1, 14. ఈ మంగళవార్త పెంతెకోస్తు సంఘటనలద్వారా మరియ పూర్తిగా పరిశుద్దాత్మకు వశవర్తిని ఐపోయింది. కనుకనే ఆమె ప్రభువునకు ప్రియపడిన మహా దాసురాలు. క్రైస్తవ సమాజంలో వెలసిన తొలి పెంతెకోస్తు భక్తురాలు, ప్రభువు ప్రసాదించిన రక్షణ భాగ్యం మనకు పరిశుద్ధాత్మద్వారా మరియ నుండి సిద్ధించింది. ఈలాగే మన జీవితంకూడ మొదటినుండి కడపటిదాకా ఆత్మకు వశమైయుండాలి. అనగా ఆత్మ మనలను నడిపిస్తూండాలి - రోమా 8,14. అప్పడు మనం తోడిప్రజలకు రక్షణకారకుల మౌతాం. 8. భక్తులు భగవంతునితో ఐక్యమౌతారు. ఆ మీదట భగవంతుడే వాళ్ళద్వారా పనిచేస్తూంటాడు. ఆత్మే వాళ్ళల్లో వుండి కృషి చేస్తూంటుంది. మరియు జీవితంకూడ ఈలాగే నడచింది. ఆమె నిజంగా భగవంతుణ్ణి పొందింది. తాను పొందిన ప్రభువుని తన కిష్టమైన వాళ్ళకందరికీ అందించిందికూడ