పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దైవప్రేమ అంటే క్రీస్తుప్రభువనీ అతని ద్వారా తండ్రినీ ప్రేమించి పూజించడం. సోదరప్రేమ అంటే తోడి జనాన్ని ఆదరించడం -రోమా 13,8. ఇక ఈ ప్రేమ శక్తిని మనకు ప్రసాదించేది ఆత్మే ఆ యాత్మద్వారా తండ్రి కుండతో నీళ్ళ పోసినట్లుగా ప్రేమశక్తిని మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరిస్తాడు - రోమా 5,5.

2) సంతోషం. క్రీస్తుని అంగీకరించేవాళ్ళకు ఆత్మ ఓ విధమైన సంతోషమూ సంతృప్తి ప్రసాదిస్తుంది - రోమా 14, 17. ఈ సంతోషాన్ని అనుభవించే భక్తులు ప్రభుని స్తుతించి కొనియాడతారు. ఆనందంతో గానం చేస్తారు.

3) శాంతి, పిశాచం కలహాన్ని తెచ్చిపెడుతుంది. కాని పరిశుద్దాత్మ ਰOਹੰ అనుగ్రహిస్తుంది - రోమా 8,6. ఈ శాంతి గూడ రెండువిధాలుగా వుంటుంది. మొదటిది, దేవునికీ మనకీ పొత్తు కుదురుతుంది. ఆ ప్రభవ క్రీస్తు ద్వారా మన పాపాలను పరిహరిస్తాడు. మనకీ ఆ తండ్రికీ రాజీ కుదురుతుంది - రోమా 5,1, రెండవది, తోడి ప్రజలకూ మనకూ పొందిక యేర్పడుతుంది. పరిశుద్ధాత్మే క్రైస్తవ సమాజాన్నంతటినీ ఒక్కటిగా బంధిస్తుంది - ఎఫే 4, 3. అనగా మనలో మనకు ఐక్యత సిద్ధిస్తుంది.

4) ఓర్పు. బైబులు భగవంతుడు చాలా ఓర్పు కలవాడు -రోమా 15, 5. అతడు త్వరపడి పాపాత్ములను శిక్షించేవాడు కాదు. భగవంతుడు మనపట్ల ఓర్పు చూపినట్లే మనమూ తోడి ప్రజల పట్ల ఓర్పు చూపాలి. ఆత్మ ఈ వరాన్ని అనుగ్రహిస్తుంది.

5) దయ. పరలోకంలోని తండ్రి కనికరం కలవాడు - లూకా 6,36. ప్రభువులాగే మనం కూడ తోడి మానవుల పట్ల దయ చూపెడుతుండాలి - కోలో 3,12. ఇతరులపట్ల కచ్చితంగా మెలగడం సులభం. దయగా మెలగడం కష్టం. ఆత్మే మనకు ఈ వరాన్ని ఈయాలి.

6) మంచితనం. మనం చేసే పనులు ధర్మబద్దంగాను న్యాయ సమ్మతంగాను ఉండాలి. ఆత్మ ఈ శక్తిని ప్రసాదిస్తుంది.

7) విశ్వసనీయత. ప్రభువు నమ్మదగినవాడు - 2కొ 1, 18-20. అతడు ఆడినమాట తప్పేవాడు కాదు. నేను మిమ్మరక్షిస్తాను అంటే క్రీస్తుద్వారా రక్షించి తీరతాడు. ఈ ప్రభువు లాగే మనం కూడ నమ్మదగినవాళ్ళమై యుండాలి. నిత్య వ్యవహారంలో ఇతరులకు మనమిచ్చిన మాటను చెల్లించుకోవాలి, దేవునిపట్లగూడ మన విధులను నిర్వర్తించుకోవాలి. కనుక ఈ ఫలంద్వారా ఆత్మ మనకు నమ్మదగిన తనం అనే గుణాన్ని ప్రసాదిస్తుంది.

8) సాధుశీలత. ఈ గుణం కలవాళ్లు ఇతరులతో మృదువుగా సౌమ్యంగా మెలుగుతారు. స్నేహశీలంగా ప్రవర్తిస్తారు. గలతీయులు 1,6లో పౌలు క్రైస్తవులకు ఈ