పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1) ప్రజలను నడిపిస్తాడు. ఓ వ్యక్తిగాని లేక ఓ సమాజంగాని ఏమిచేయాలో, ఏలా నడుచుకోవాలో తెలియజేస్తాడు. అంతియోకయలోని క్రైస్తవ సమాజంలో పాలునీ బర్నబానీ ప్రేషితోద్యమానికి పంపాలని ప్రవచనం ద్వారా తెలియజేసాడు ప్రభువు - అచ 13,2.

2) ప్రోత్సాహం. ప్రవచనం ద్వారా ప్రభువు తన ప్రజలకు ఓదార్పునీ ఉపశాంతినీ ప్రోత్సాహాన్నీ కలిగిస్తాడు -1కొ 14,3. ఇప్పడు మన కాలంలో ప్రవచనం నెరవేర్చే ప్రధాన ప్రయోజనం ఇదే.

3) తప్ప దిద్దడం. ప్రవచనం ద్వారా ప్రభువు ఆయావ్యక్తుల దుష్కార్యాలను వెల్లడిచేసి వాళ్లు తమ తప్పిదాలను సరిదిద్దుకొనేలా చేయడం గూడ కద్దు - 1కొ 14,24.

2. మన క్యాతలిక్ సమాజంలో ప్రవచనం అంతగా లేదు. ఇప్పడు పెంతెకోస్తు ఉద్యమం ఈ వరాన్ని పునరుద్ధరిస్తూంది. ఈ వుద్యమం సమావేశాల్లో చాలా మంది భక్తులు ప్రవచనం చెపూంటారు. ప్రవచనమంటే దైవ సందేశాన్ని తెలియ జేయడం మాత్రమేనని చెప్పాం. ఈ భక్తులు సమావేశాల్లో చెప్పే ప్రవచనాలు ఇంచుమించు ఈలా వుంటాయి. "ప్రభువు ఈలా అంటున్నాడు : మీరు ఏమీ ఆందోళనం చెందకండి. నేను మిమ్మ ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా అంగీకరిస్తాను, ఆదరిస్తాను గూడ." "నా ఆరోగ్యశక్తి మీమీద పనిచేస్తుంది. మీ హృదయాలను విప్పి నాశక్తిని పొందండి." "భక్తులారా! మీరు నా ప్రేమను చవిజూస్తారు, నా రక్షణాన్ని అనుభవిస్తారు."

ఈలాంటి ప్రవచనాలు మనకు ఏమి మేలు చేస్తాయి? ఇవి మనం ఏలా నడచుకోవాలో చెప్తాయి. మనకు ఓదార్పునీ ప్రోత్సాహాన్నీ ఇస్తాయి, వీటిద్వారా ప్రభువు మనకు ఊరటను కలిగించే వాక్యాలను విన్పిస్తాడు.

3. ప్రవచనం చాలారకాలుగా వుంటుంది :

1) ఒకోమారు ప్రభువు దర్శనాలద్వారా తన భక్తులతో మాటలాడతాడు. దర్శనాల ద్వారా వాళ్ళను ప్రోత్సాహపరుస్తాడు - సంఖ్యా 12,6.
2) కొందరితో ప్రభువు తన సందేశాల ద్వారా మాట్లాడతాడు. ప్రభువే భక్తుని హృదయంలో ఓ సందేశం విన్పిస్తాడు. లేదా ప్రభు ప్రబోధంవల్ల భక్తుడే ఓ సందేశాన్ని పలుకుతాడు, ఆ సందేశం అతన్ని ప్రోత్సాహపరుస్తుంది. అనగా భక్తుడు తన్ను ప్రోత్సాహపరచే సందేశాన్ని తానే ఉచ్చరిస్తాడు.
3) మన చుటూరా ఉన్నవాళ్ళు ప్రభువు వలన ప్రబోధితులై ఏదో ఓ మాట పలుకుతారు. లేదా అదివరకే జరిగిన ఓ సంఘటనం భావాన్ని వివరిస్తారు. లేదా ఓ