పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొందరికి ఈ ప్రార్ధన సులభంగానే అలవడుతుంది. కొందరికి అంత సులభంగా అలవడదు, ఈలాంటివాళ్లు ఈ జపాన్ని బాహ్యంగా అభ్యాసం చేయాలి. మామూలుగా ఈ ప్రార్థనను జపించేవాళ్లు పెదవులతో "బెబ్చెబ్చెబ్బె" అన్నట్లుగా శబ్దంచేయడంకద్దు, ఈ ప్రార్థనను కోరుకొనేవాళ్లు కూడ ఇదేపద్ధతిలో అభ్యాసం చేయవచ్చు. రోజూ కొన్ని నిమిషాలపాటు ఈలా అభ్యాసం చేసికొంటూపోతే కొంతకాలంమైనంక ఆత్మ ఈ యభ్యాసాన్ని ప్రార్థనగా మారుస్తుంది. ఈలా చేయాలంటే కొంత నమ్మికా వినయమూ పట్టుదలా అవసరం.

చాలాకాలం అభ్యాసం చేసినంకగూడ కొందరికి ఈ ప్రార్ధనాపద్ధతి స్వల్పంగా అలవడుతుంది. కాని ఎంత స్వల్పంగా అలవడినా దీన్ని జపించాలేగాని వదలివేయకూడదు. ఎందుకంటే ఇది చాల శ్రేష్టమైన ప్రార్ధనం. మన భాషనూ మన భావాలనూ త్రోసిపుచ్చి పరిశుద్ధాత్మే స్వయంగా మన ఆత్మలో さまも ప్రార్ధనం అని ముందే చెప్పాంగదా!

15. వివేచనం

1. వివేచనం అంటే మంచి చెడ్డలను ఆలోచించి చూచే శక్తి, మనం ఆత్మలోకి జ్ఞానస్నానం పొందినపుడు పరిశుద్దాత్మ మనమీదికి బలంగా వేంచేసి వస్తుంది. మనలను తనవశం చేసికొని తన ఇష్టంవచ్చినరీతిగా నడిపిస్తుంది. అది చూచి పిశాచం కూడ మనలను శోధించాలని కోరుకొంటుంది. మనమీద తన ప్రభావం చూపుతుంది. ఈలాంటి పరిస్థితుల్లో పవిత్రాత్మే మనలను ప్రబోధిస్తుందో లేక అపవిత్రాత్మే ప్రబోధిస్తుందో తెలిసికోకలిగి వుండాలి. ఇదే వివేచనం.

పిశాచం ఒకోమారు దేవుని యనుమతితో మనలను శోధించడం కద్దు. సైతాను పేత్రుని జల్లెడలోని ధాన్యాన్ని లాగ జల్లించాలని కోరుకుంది - లూకా 22,31. అనగా అతన్ని పట్టుకొని బలంగా ఊపాలని - అంటే తీవ్రంగా శోధించాలని - కోరుకొంది, దైవవాక్యమనే విత్తనం మన హృదయంలో పడి వేరు పాతుకోకపూర్వమే సైతాను దాన్ని దొంగిలించుకొని పోతుంది - మార్కు4,15. దయ్యం మనలను శోధిస్తుందనడానికి ఈ యుదాహరణలు చాలు.

పిశాచం ఎప్పడూ దైవరాజ్యాన్ని చెరచాలని చూస్తూంటుంది. కనుక అది దైవమార్గాన్ని అనుసరించేవాళ్ళని అపమార్గం పటిస్తుంది. ప్రభువు ఎడారిలో ప్రార్ధన చేసికొంటూ తండ్రిని పూజించుకొంటున్నాడు. ఇది పిశానిచాకి గిట్టలేదు. కనుక, నీవు దేవాలయం గోపురంమీద నుండి క్రిందికి దూకమని శోధించింది — లూకా 4,9. దయ్యం