పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేరుస్తుంది. ఆ యాత్మ మనకు ఎన్నో వరాలను ప్రసాదిస్తుంది. ఈ వరాల్లో కొన్ని మనవ్యక్తిగత పావిత్ర్యానికి ఉపయోగపడతాయి. అవి మనలో విశ్వాసం నమ్మిక ప్రేమ అనే పుణ్యాలను వృద్ధిచేసి మనలను క్రీస్తుకి మరింత సన్నిహితులనుగా చేస్తాయి. మన క్యాతలిక్ సంప్రదాయం ప్రకారం ఈ వ్యక్తిగత పావిత్ర్యానికి తోడ్పడే పరిశుద్దాత్మ వరాలు ఏడు. అవి జ్ఞానం, ಬುದ್ಧಿ, తెలివి, ఆలోచనం, దృఢత్వం, దైవభయం, దైవభక్తి. పరిశుద్దాత్మ మెస్సియాను ఈ వరాలతో నింపుతుందని యెషయా ప్రవచించాడు -112. ఇవే వరాలను ఆత్మ మనకు కూడ ఇస్తుంది,

2. ఇక ఆత్మచేసే రెండవ కార్యం, మనలను సమాజ పరిచర్యకు పరికొల్పుతుంది. ଔର୍ବ୍ବର୍ଟ సమాజంలోని ప్రేపిత ఉద్యమం, సేవ, పరిచర్య అంతా ఆత్మద్వారానే, ఆత్మ సహాయంతో మనం దేవుని ప్రేమను ఇతరులకు చాటిచెప్తాం. ఇతరులకు క్రీస్తుని బోధిస్తాం. ఇదే ప్రేషిత ఉద్యమం. ఈ సేవద్వారా మనం క్రీస్తు జ్ఞానశరీరమైన క్రైస్తవ సమాజాన్ని వృద్ధిలోకి తీసికొనివస్తాం.

ఈలా మనం తోడి ప్రజలకు ప్రేషిత సేవ చేయడానికిగాను ఆత్మ యెన్నోవరాల నిస్తుంది. వీటిని ప్రేషితవరాలు లేక సేవావరాలు అనాలి, ఈ సేవావరాలను పౌలు తన జాబుల్లో చాల తావుల్లో పేర్కొన్నాడు, ఇవి యెన్ని అన్న ప్రశ్నకు తృప్తికరమైన సమాధానం లభించదు.

3. పౌలు తనజాబుల్లో నాలు తావుల్లో ఈ సేవావరాలను పేర్కొన్నాడు. వాటి పట్టికలను ఈ క్రింద పొందుపరుస్తున్నాం.

1కొ 12,8-10 1కొ 12,28 రోమా 12,6-8 ఎఫే 4,11
బుద్ధి అపోస్తలులు ప్రవచనం అపోస్తలులు
జ్ఞానం ప్రవక్తలు పరిచర్య ప్రవక్తలు
విశ్వాసం బోధకులు బోధ సువార్తకారులు
స్వస్థత అద్భుతకారులు ప్రోత్సాహము కాపరులు
అద్భుతాలు ఆరోగ్యదాతలు దానం బోధకులు
ప్రవచనం సహాయకులు పర్యవేక్షణ
వివేచనం పరిపాలకులు కరుణకార్యాలు
భాషలు భాషకులు

4. ఈ పట్టికల్లో కొన్నివరాలు రెండుమూడుసార్లు వచ్చాయి. ఆలాంటి వాటిని తొలగించినాగాని ఇక్కడ పౌలు పేర్కొన్న సేవావరాలు ఇరవైదాకా వున్నాయి, ఇవి ఆ తొలినాటి పౌలు సమాజాల్లోని క్రైస్తవభక్తుల్లో కన్పించిన వరాలు. పౌలుకూడ ఈ వరాలను