పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6) కడన ప్రభువు మన బాధాకరమైన స్మృతిని నయంజేస్తాడు అని విశ్వసించాలి - మార్కూ 11,24, అతనికి వందనాలు చెప్పాలి.

5. ఈలా మనం పూర్వస్మృతులు నయంగావడం కోసం ప్రార్ధనం చేసికొన్నపుడు ఏం జరుగుతుంది? ప్రభువు మన పూర్వస్మృతిని పూర్తిగా తుడిచివేయడు. కాని ఆ స్మృతివల్ల మనం ఇప్పడు అనుభవించే కష్టమూ విచారమూ భయమూ ద్వేషమూ మొదలైన అనిష్టగుణాలను తొలగిస్తాడు. ఆ స్మృతి అనే పుండులోని విషాన్ని పిండివేస్తాడు. పైగా ఆనాడు మనకు నిరాకరింపబడిన ప్రేమ అంగీకారము మెప్పుకోలు అనే మంచి గుణాలు ఈనాడు మన హృదయంలో నిండుకొనేలా చేస్తాడు. దీనివల్ల మనకు నూత్న బలమూ ఆనందమూ సిద్ధిస్తుంది. మన మీద మనకే నమ్మకం గలిగి మన ప్రస్తుత సమస్యలను ధైర్యంతో ఎదుర్కోగలుగుతాం.

6. పూర్వస్మృతులు నయంగావడంకోసం చేసిన ప్రార్ధన మామూలుగా ఫలిస్తుంది. కాని ఈలా ఫలించాలంటే పైన నాల్గవ అంశంలో చెప్పిన షరతులన్నీ నెరవేరాలి. విశేషంగా మనకు అపకారం చేసినవాళ్ళని క్షమించాలి. ఈలా క్షమించక పోతే మన పూర్వస్మృతులు నయంకావు. ఈ నయం కావడమనేది ఒకోమారు ప్రార్థన చేసిన వెంటనే జరుగుతుంది. ఒకోమారు కొంతకాలమైనంక నిదానంగా జరుగుతుంది. వెంటనే నయమైనా కాలక్రమేణ నయమైనా మనంమాత్రం ప్రభుని స్తుతించాలి. ఈ స్తుతిద్వారా ప్రభువు మరీ ఎక్కువగా ఆరోగ్యం దయ చేస్తాడు.

7. పూర్వస్మృతులను నయంజేసికోవడానికి ఇతరుల సహాయం కూడా పొందవచ్చు. కొందరికి వ్యాధులను నయం జేసే వరం వుంటుంది. ఆలాంటి వాళ్ళచేత ప్రార్ధన చేయుంచుకొని మానసికమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. కాని ఈలాంటి వాళ్ళు మనం కోరుకొన్నపుడెల్లా దొరకరు. ఆలాంటప్పుడు మనకు మనమే ఈ బాధలనుండి విముక్తులం కావడానికై ప్రార్థన చేసికోవాలి. ఇప్పడు మనలను వేధించే సమస్యను తీసికొని ప్రభువు ముందు పెట్టి ఆ బాధను తొలగించమని ప్రార్ధించాలి. ఆ ప్రార్థనా ಏಜ್ಜಿತಿನಿ పైన వివరించాం.

7. పిశాచంనుండి విముక్తి కలిగించేవాడు

1. లోకం, శరీరం పిశాచం అని నరునికి జ్ఞాన శత్రువులు మూడున్నాయి. మొదటిది, లోకంలోని తోడిజనం మనలను పాపానికి పరికొల్పుతారు. రెండవది, మన పతనస్వభావంకూడ మనలను పాపానికి పురికొల్పుతుంది. ఆదాము ద్వారా మనకు