పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. ఆత్మ నామాలూ, సంకేతాలూ

1. బైబుల్లో ఆత్మకు ప్రధానమైన హీబ్రూ పేరు రువా (ఆత్మ, వూపిరి). ఈ పేరు కాక ఇతర నామాలు కూడ కొన్ని వున్నాయి. ఆత్మ "ఆదరణ కర్త" - యోహా 14,16. ఓదార్చేవాడని ఈ పేరుకి అర్థం. అతనికి "సత్యస్వరూపి" అని ఇంకో పేరు - యోహా 16,13. రక్షణ ప్రణాళికను తెలియజేసేవాడని ఈ పేరుకి అర్థం. "దేవుని వాగ్దానం" అని మరో పేరు - గల 3,14. తండ్రి ఈ యాత్మను పంపుతానని వాగ్దానం చేసాడు కదా! "దత్త పత్రత్వపు ఆత్మ" అని వేరొక పేరు - రోమా 8,15. ఆత్మద్వారా మనం తండ్రికి దత్తపుత్రులమూ పత్రికలమూ ఔతామని భావం. ఇంకా అతనికి "క్రీస్తు ఆత్మ", "ప్రభువు ఆత్మ", "దేవుని ఆత్మ", "తండ్రి ఆత్మ" అనే నామాలుకూడ వున్నాయి. 1పేత్రు 4,14 అతన్ని "మహిమకల ఆత్మ" అని పిలుస్తుంది. "పవిత్రాత్మ" అనే పేరు చాలాచోట్ల విన్పిస్తుంది.

2. బైబుల్లో ఆత్మకు చాల సంకేతాలున్నాయి. ఇక్కడ ముఖ్యమైనవాటిని పరిశీలిద్దాం

1. జలం ఒక సంకేతం. నీరు ప్రాణాన్నిచ్చినట్లే ఆత్మకూడా మనకు జీవాన్నిస్తుంది. మనం జ్ఞానస్నాన జలాలద్వారా ఆధ్యాత్మిక జీవాన్ని పొందుతాం - యోహా 3,5. జీవజలమనికూడ ఆత్మకు పేరు - యోహా 7,28. ఆత్మను జలాన్ని లాగ పానంచేస్తాం - 1కొ 12, 13.

2. అభిషేకం మరో సంకేతం - 1యేహా 2,20. ఈ పదం ప్రధానంగా భద్రమైన అభ్యంగనాన్ని సూచిస్తుంది. క్రీస్తకీ మనకీకూడ అభిషేకం చేసేది పవిత్రాత్మే - లూకా 4, 18.

3. అగ్ని ఇంకో సంకేతం. ఇక్కడ అగ్ని అంట్టే పాపమాలిన్యాన్ని తొలగించి మనలను పవిత్రపరచే శక్తి అని భావం. క్రీస్తు మనకు ఆత్మతోను అగ్నితోను జ్ఞానస్నానమిస్తాడు - లూకా 3,16. మనం మన హృదయంలోని ఆత్మాగ్నిని ఆర్పివేసికోగూడదు - 1తెస్చ 5,19.

4. మేఘం, వెలుగు ఇంకో ప్రతీక. పూర్వం మేఘం మోషే గుడారంమీదికి దిగివచ్చింది - నిర్గ 33,9–10. ఆత్మ మేఘంలాగ మరియమీదికి దిగివచ్చి ఆమెను గర్భవతిని చేసింది - లూకా 1,35. క్రీస్తు దివ్యరూపధారణ సమయంలో మేఘం కన్పిస్తుంది - లూకా 9,84. అతడు మేఘంగుండ స్వర్గానికి పోయాడు - అచ 1,9. 3