పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమాధానమూ కుమ్మరిస్తాడు. 3. ఇంకా కొందరు శాశ్వతమైన వ్యాధిబాధలతో శ్రమలనుభవిస్తున్నారు. ఈలాంటి వాళ్ళకు ప్రభువు ఆరోగ్యం ప్రసాదిస్తాడు. దేహదార్థ్యం దయచేస్తాడు. 4. వేరు కొందరు నిరాదరణం, అనంగీకారం, అస్పృశ్యత మొదలైన సాంఘిక అన్యాయాల వల్ల బాధపడుతున్నారు. ఈలాంటి వాళ్ళకు ప్రభువు తన ఆత్మ ద్వారా ప్రేమభావమూ, ఐక్యతా, పరస్పరాంగీకారమూ అనే వరాలను ప్రసాదిస్తాడు. 5. ఇంకా కొందరిని పిశాచం బంధించి నానా యాతనలూ పెడుతూంటుంది. ఈలాంటి వాళ్ళను ప్రభువు పిశాచదాస్యం నుండి విముక్తి చేస్తాడు, ఈ విధంగా క్రీస్తు రోజురోజు నరులను రక్షిస్తూనే వుంటాడు. ఆ ప్రభువిచ్చే రక్షణాన్నిమనం ఆదరంతో అందుకోవాలి.

3. ఆ ప్రభువుని మనం ఆత్మ రక్షకునిగా అంగీకరించినపుడు మనకు రక్షణం లభిస్తుంది. అతడు “భారంతో అలసిసాలసి వున్నవాళ్లంతా నావద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను" అంటాడు - మత్త 11, 28. ప్రభువుని మనం ఆహ్వానించాలి. అతన్ని మన హృదయాంతరాళంలో ఏకైక రక్షకునిగా నెలకొల్చుకోవాలి. అతడు మన హృదయ కవాటాన్ని మెల్లగా తడతాడు. ఆ ప్రభుస్వరాన్ని విని మనం హృదయమనే తలుపు తెరచినట్లయితే అతడు మన లోనికి వేంచేస్తాడు. మనకు ఆపడూ స్నేహితుడూ ఔతాడుదర్శ 3, 20. ప్రభువు దివ్యసాన్నిధ్యం వలన మన హృదయం కరిగి నిర్మల జీవితానికి పూనుకొంటాం, ప్రభువు కోరుకొనేది కూడ ఈ హృదయ పరివర్తనమే - మార్కు 1,15. పాపం చేసినపుడు సృష్టికర్తను కాదని సృష్టివస్తువుల వద్దకు వెళ్ళిపోతాం. దుడుకు చిన్నవాడు ఆలా చేసాడు. తండ్రిని కాదని దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఇక, పరివర్తనం చెందినపుడు ఆ సృష్టివస్తువులను విడనాడి మల్లా సృష్టికర్త వద్దకు తిరిగి వస్తాం. దుడుకు చిన్నవాడు మల్లా తండ్రి యింటికి మరలివచ్చాడు." - లూకా 15,20.

4. ఈ పరివర్తనం ద్వారా ప్రభువు మన హృదయంలోకి అడుగిడతాడు. మనం నూత్నమానవుల మౌతాం. మన హృదయంలోని బుద్దులు క్రొత్తవి ఔతాయి. మనకు నూత్న స్వభావం లభిస్తుంది - ఎఫే 4,23, ఎవడు క్రీస్తుని అంగీకరించి అతనియందు నెలకొంటాడో వాడు నూత్న సృష్టి ఔతాడు. వానిలో ప్రాత జీవితం నశించి క్రొత్తజీవితం ప్రారంభమౌతుంది - 2 కొ 5, 17

5. హృదయ పరివర్తన మనేది ఆత్మ యిచ్చే వరం. ఆ యాత్మే మన హృదయం స్వీయపాపాన్ని గుర్తించేలా చేస్తుంది - యోహా 16,8. మన అసత్యజీవితాన్ని ఖండించి మనం సత్యాన్ని చేపట్టేలా చేస్తుంది. క్రీస్తే ఈ సత్యం - 16,13. పరిశుద్దాత్మలోనికి జ్ఞానస్నానం పొంది ఆ దివ్యాత్మచే నడిపింపబడే నరులకు సున్నితమైన మనస్సాక్షి