పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిశుద్ధాత్మలోనికి జ్ఞానస్నానం పొందిన భక్తులకు భగవంతుని ప్రేమ ఎంతో గొప్పగా అనుభవానికి వస్తుంది. వాళ్ల హృదయం దైవప్రేమతో పులకించిపోతుంది.

6. ఈ దైవప్రేమద్వారా భక్తులు (1) ఓవైపు సోదరప్రేమను అలవర్చుకొంటారు. 'నా సోదరులలో అత్యల్పునికి చేసిన ఉపకారం నాకు చేసినట్లే భావిస్తాను" అన్న ప్రభువాక్యాన్ని అర్థంచేసికొంటారు - మత్త25,40. (2) మరోవైపు ప్రభువు మంచితనాన్ని లోకంముందు చాటిచెప్పడం ప్రారంభిస్తారు. ప్రభువు కారుణ్యానికి తాము సాక్షులుగా మొలుగుతారు – అచ 18,

7. ఈవుద్యమంద్వారా భక్తుల్లో “దేవుడు అన్నికార్యాలూ తన్ను ప్రేమించేవాళ్ల మంచికే తోడ్పడేలా చేస్తాడు" అనే నమ్మిక ఏర్పడుతుంది - రోమా 8,28. ఈ నమ్మికద్వారా భక్తులు ఎల్లవేళలా ప్రభుని స్తుతించి కొనియాడతారు. సమస్త కార్యాల్లోను యేసుక్రీస్తుద్వారా తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తారు - ఎఫే 5,20. కనుకనే పవిత్రాత్మ ఉద్యమంలో పాటలూ సుతులూ విరివిగా వాడుతూంటారు.

4. ప్రభువు మనలను రక్షించేవాడు

1. మనం ఓ చీమలపుట్టను కాపాడాలి అనుకుంటే చీమలంకాము. కాని భగవంతుడు నరుణ్ణి కాపాడాలి అనుకొని నరుడై జన్మించాడు, అతడు లోకాన్ని ఎంతోప్రేమించి తన ఏకైక కుమారుడ్డి ప్రసాదించాడు. — యోహా 3,16, ఆ ప్రభువు రక్షించాలి అనుకొన్నలోకం ఏలాంటిది? రోజూ వార్తాపత్రికలు చూస్తే మనకు తెలుస్తుంది. యుద్ధాలూ, హత్యలూ మోసాలూ, వైరమూ, కామమూ పరపీడనమూ - ఇటువంటి వాటితో నిండివుండేది. ఒక్క మన దేశంలోనే ప్రతినిమిషమూ ఓ హత్య జరుగుతూంటుంది. ఈలాంటి పాపపులోకాన్ని రక్షించాలి అనుకున్నాడు భగవంతుడు.

2. ఈలాంటి లోకాన్నీ ఈలాంటి నరుజ్జీ రక్షించడానికి విజయం చేసాడు ప్రభువు. ఆయనకు యేసు అని పేరు. రక్షకుడు అని ఆ పేరుకి అర్థం - మత్త 1.21. ఈ ప్రభువు నరులను రక్షిస్తున్నాడు. పెంతెకోస్తు ఉద్యమంలో ఈనాడు వందలకొలది ప్రజలు ప్రభురక్షణాన్ని చవిజూస్తున్నారు. నానారంగాల్లో ఈ ప్రభువు నరులను రక్షిస్తున్నాడు. 1.కొందరు షాపంవలనా దురభ్యాసాల వలనా బాధపడుతున్నారు. ఈలాంటి వాళ్లను ప్రభువు పాపంనుండి విముక్తి చేస్తాడు. 2.మరి కొందరు విచారము దుఖఃము ఆందోళనము ఒంటరిపాటు అనే మనోభావాలవలన బాధపడుతున్నారు.ప్రభువు ఈలాంటివాళ్ళ మనోభావాలను చక్కదిద్దుతాడు.వాళ్ల హృదయాల్లో తన ఆత్మను నిల్చి సంతోషమూ