పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంత్య భోజనం ముగిసినపుడు ప్రభువు శిష్యులతో ఈ లోకంలో నేను మల్లా విూతో కలసి ఈ ద్రాక్షరసం త్రాగనన్నాడు. ఎందుకంటే అతడు ఆ మరుసటి రోజే సిలువపై చనిపోతాడు. కాని అతడు తండ్రి రాజ్యంలో శిష్యులతో కలసి నూత్నంగా ద్రాక్షాసవాన్ని సేవిస్తానన్నాడు – 26,29. అది అతని వృత్తానానంతరం జరుగుతుంది. అనగా వుత్తానానంతరం క్రీస్తూ శిష్యులూ మోక్షంలో ఐక్యమౌతారని భావం. యూదులు మోక్షాన్ని గొప్పవిందుగా భావించారు. ఈలా ఈ కడపటి వాక్యం క్రీస్తు మరణితానాలను సూచిస్తుంది.

అంత్య భోజనమే నేటి మన దివ్యసత్ర్పసాద విందు. దీనిలో మనం భక్తిభావంతో పాల్గొనాలి. అది పవిత్ర బోజనం. క్రీస్తు మరణోత్దానాలను జ్ఞప్తికి తెచ్చే భోజనం.

4. పేత్రు బొంకు - 26, 30-35

అంత్య భోజనం ముగిసాక క్రీస్తూ శిష్యులూ ఓ కీర్తన పాడారు. ఇది 114 నుండి 118 వరకు వచ్చే స్తుతి కీర్తనల వర్గం లోనిది. ఈజిప్టు దాస్యం నుండి యిప్రాయేలీయులను రక్షించినందులకు ఈ కీర్తనలు ప్రభుని స్తుతిస్తాయి. సువిశేషం క్రీస్తు పాటలు పాడినట్లుగా చెప్పేది ఈ వొక్క సందర్భంలోనే.

క్రీస్తు యూదా పతనాన్ని గూర్చి ముందుగానే తెలియజేసినట్లే ఇతర శిష్యులు పడిపోవడాన్ని గూర్చిగూడ ముందుగానే తెలిపాడు, అతడు వాళ్ళకు పతన కారణమౌతాడు. నరులు త్రోవలో రాతిని తట్టుకొని పడిపోయినట్లుగా శిష్యులు క్రీస్తుని తట్టుకొని పడిపోతారు. అనగా అతనిపట్ల వాళ్ళ విశ్వాసం చలిస్తుంది. ఎందుకు? శిష్యులు అతడు మహిమ ప్రతాపాలు గల మెస్సీయాగా వచ్చి రోమనులతో యుద్ధం చేస్తాడు అనుకొన్నారు. కాని క్రీస్తు వాళ్లు ఆశించినట్లుగా తన శక్తిని ప్రదర్శించడు. చేతగాని వాళ్లాగ సిలువ విూద చనిపోతాడు. అందుచే వాళ్ళ విశ్వాసం చలిస్తుంది. వాళ్లు అతన్ని విడనాడి పారిపోతారు.

నేను గొర్రెలకాపరిని వధిస్తాను, మందలోని గొర్రెలు చెల్లాచెదరౌతాయి అని జకర్యా ప్రవక్త పూర్వమే ప్రవచనం చెప్పాడు - జక 13,7. ఆ ప్రవచనం క్రీస్తు పట్ల నెరవేరింది. శత్రువులు క్రీస్తు కాపరిని పట్టుకోగానే శిష్యులంతా భయపడి పారిపోతారు. క్రీస్తు యూదులకు కాపరి, లేక నాయకుడు. ఆ ప్రజలు కాపరి లేని మందలాగ వుండడం జూచి ప్రభువు జాలిచెంది వారి కోప తీసికొన్నాడు. వారికి బోధ చేసి అద్భుతాలు చేసి వారిని దారికి తీసికొని రాగోరాడు. 9,36.

ప్రభువు ఉత్థానమైన పిమ్మట శిష్యులకంటె ముందుగా తాను గలిలియ సీమకు వెల్తానని చెప్పాడు - 36,32. ప్రభువు వచ్చినపని అతని మరణంతో ముగియదు.