పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిబంధనం చేసాడు. అప్పడతడు యావే మిూతో చేసికొన్న నిబంధనకు సంబంధించిన రక్తం ఇదే అని పల్మాడు - నిర్గ 24,7.ఆ మోషే నిబంధనం కడపటి విందులో క్రీస్తు నందు నెరవేరింది. మోషే నిబంధన రకాన్ని మనసులో పెట్టుకొనే క్రీస్తు "ఇది నూత్న నిబంధనo యొక్క నా రక్తం అన్నాడు. ఆ నిబంధనం యూదులకు రక్షణాన్ని సంపాదించి పెట్టింది. అలాగే ఈనాడు క్రీస్తు చేసే నిబంధనం గూడ నూత్న ప్రజలకు రక్షణాన్ని చేకూర్చిపెడుతుంది. ఆనాడు మోషే నిబంధనం ద్వారా యిప్రాయేలీయులు యావే ప్రజలయ్యారు. ఈనాడు క్రీస్తు నిబంధనం ద్వారా ఈ నూత్న ప్రజ కూడ దైవజనమౌతారు. ఈ దైవజనం ఒక్క భక్త సమాజంగా ఏర్పడి ఈ దివ్యశరీరాన్ని మళ్లామల్లా భుజిస్తారు. ఇదే నేటి దివ్యసత్ర్పసాద విందు.

క్రీస్తు రక్తం "అనేకుల" పాపపరిహారార్ధం చిందబడుతుంది. ఇక్కడ "అనేకులు" అంటే చాలమంది అని అర్ధం గాదు. అందరు అనే అర్థం. యెషయా వర్ణించిన బాధామయ సేవకుడు "పెక్కుమంది" దోషాలను భరిస్తాడు - 53, 12. అనగా అందరి దోషాలను భరిస్తాడు. అలాగే క్రీస్తు కూడ అందరి పాపాలు పరిహరిస్తాడని భావం. మత్తయి క్రీస్తే మన బాధామయ సేవకుడని తన సువిశేషంలో చాలసార్లు సూచించాడు. బాధామయ సేవకుడు ప్రధానంగా ప్రజలను రక్షించేవాడు. క్రీస్తు సొంత పేరు యేసు, ఆ పేరుకి పాపం నుండి మనలను రక్షించేవాడని అర్థం - మత్త 121. కనుక అతడు ఆ సేవకునికి పోలికగా వుంటాడు. ఆ సేవకుణ్ణి యెషయా

అతడు మన బాధలను భరించాడు
మన దుఃఖాలను వహించాడు

అని వర్ణించాడు - 53,4. మత్తయి ఈ వాక్యాలను క్రీస్తుకి ఈ విధంగా వర్తింపజేసాడు.

ఆయన మన బలహీనతలను తనపై వేసికొన్నాడు
మన రోగాలను తానే భరించాడు - 8, 17.

అనగా అద్భుతాలు చేసి ప్రజల వ్యాధిబాధలు తొలిగించడం ద్వారా ప్రభువు ఆ ప్రజల బాధలను ఎత్తి తన నెత్తిన పెట్టుకొన్నట్లయింది.

బాధామయ సేవకుబ్లాగే ప్రభువు ప్రధానంగా సేవకుడు. అతడు సేవలు చేయించుకోవడానికి కాక సేవలు చేయడానికే వచ్చాడు. అనేకుల రక్షణార్థం తన ప్రాణాలు ధారపోయడానికి వచ్చాడు - మత్త 20,28.

క్రీస్తు చిందించే రక్తం "అనేకుల పాప పరిహారానికి" ఉద్దేశింపబడింది. అతడు ముఖ్యంగా నరుల పాపాలను తొలగించేవాడు. ఈ లోకంలో మనుష్యకుమారునికి నరుల పాపాలు మన్నించే అధికారం వుందని వాకొన్నవాడు - మత్త 9,6.