పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిస్రాయేలీయులకు దయచేసిన మన్నా భోజనాన్ని జ్ఞప్తికి దెస్తాయి - నిర్గ 16. ఇంకా యివి పూర్వం ఏలీయా యెలీషా ప్రవక్తలు భక్తులకు అద్భుతంగా ఆహారాన్ని దయచేసిన సందర్భాలను గూడ జ్ఞప్తికి దెస్తాయి. ఏలీయా భక్తురాలైన సారెఫతు విధవకు పిడతలో నూనె కుండలో పిండి తరిగిపోకుండా వుండేలా చేసాడు - 1రాజు 17,8-16. అలాగే యెలీషా ఇరువది రొట్టెలతోను కొద్దిపాటి గోదుమ వెన్నులతోను నూరురు భక్తులకు చాలినంత ఆహారాన్ని పెట్టాడు - 2 రాజు 4,42–44. ఈలా క్రీస్తు రొట్టెలను పెంచి చాల మందికి భోజనం పెట్టిన రెండద్భుతాలు బైబుల్లోని పూర్వ భోజన సంఘటనలను జ్ఞప్తికి దెస్తాయి. పైగా ఈ యద్భుతాలు బావికాలంలో రాబోయే భోజనాన్ని గూడ సూచిస్తాయి. యెషయా పవక్త భావికాలంలో ప్రభువు సియోను కొండమిూద దివ్యభోజనాన్ని వడ్డిస్తాడని ప్రవచించాడు - 25,27. ఈ దివ్యభోజనం మెస్సియా కొనివచ్చే రక్షణానికే చిహ్నంగా వుంటుంది.

సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కొండమిూద
సకల జాతులకు విందు సిద్ధంజేస్తాడు
అది ప్రశస్త మాంసభక్ష్యాలతోను
మధువుతోను కూడి ఉంటుంది
క్రొవ్విన పశువుల మాంసంతోను
తేరుకొనిన ద్రాక్షాసవంతోను నిండివుంటుంది.

రక్షణ కాలమైన అంత్యకాలంలో క్రీస్తు కరుణామయుడైన మెస్సీయాగా వచ్చాడు. అతడు ప్రజలకు రొట్టెల ఆహారాన్నేగాక వాక్యాహారాన్నిగూడ పెట్టాడు. ప్రజల వ్యాధిబాధలను తొలగించి వారికి చికిత్సాహారాన్నిగూడ పెట్టాడు. ఇప్పడు ఈ కడపటి భోజనాన్ని కూడ శిష్యులకు అందిస్తున్నాడు.

పూర్వం యూదులు దాస్యవిముక్తి పొందిన పిదప ఐగుపు నుండి బయలుదేరక ముందు పాస్క గొర్రెపిల్లను భుజించారు. ఈ పాస్క విందులో క్రీస్తు తన్నే శిష్యులకు ఆహారంగా అందిస్తాడు. ఇక్కడ శిష్యులు భుజించే రొట్టె క్రీస్తు శరీరం. వారు పానం చేసే ద్రాక్షరసం అతని నెత్తురు. ఈ విందులో త్రుంచిన రొట్టె సిలువపై నలిగిపోయిన క్రీస్తు దేహానికి గుర్తు. వారు పానం చేసే ద్రాక్షరసం సిలువపై చిందించబడే క్రీస్తు రక్తానికి గురుతు. కనుక పాస్కవిందు శుక్రవారం అతడు అనుభవింపబోయే సిలువ మరణాన్ని సూచిస్తుంది.

ప్రభువు పానపాత్రాన్ని అందుకొని "ఇది నూత్న నిబంధనం యొక్క నా రక్తం" అని పల్కాడు. పూర్వం మోషే కోడెల నెత్తురు ప్రజలమిూదా, పీఠం విూదా చిలకరించి ఒక