పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కార్యం చేయడం కంటే అసలు పట్టివుండకుండా వుంటే బాగుండేది. ఈలాంటి పాపకార్యం చేసాడు. కనుక అతడు దేవుని తీర్పునూ శిక్షనూ తప్పించుకోలేడు. ప్రతి నరుడు తన కార్యాలకు తాను బాధ్యుడవుతాడు. యూదా ధనాన్నెన్నుకొని క్రీస్తుని నిరాకరించాడు. అతడు ఆ పాపానికి తగిన శిక్ష అనుభవించి తీరుతాడు. ఇవి భయంకరమైన పలుకులు. యూదా లాగే మనమూ ప్రభువుకి ద్రోహం చేసి అతడు పొందిన శాపాన్ని కొనితెచ్చుకోవచ్చు ఈ ప్రమాదం మన జీవితంలో ఎప్పడూ వుంటుంది.

కడన యూదా తన తప్పను కప్పిపెట్టుకోగోరి గురువా! నిన్నప్పగించేది నేను, నేను కాదు గదా? అని అడిగాడు. క్రీస్తు ఆ మాట నీవే చెప్పావు అని జవాబిచ్చాడు - 26,24.

విూద శిష్యులంతా క్రీస్తుని ప్రభువు అని సంబోధించారు. యూదా వొక్కడే అతన్ని గురువు అని సంబోధించాడ. యూదరబ్బయిలు క్రీస్తుని శంకిస్తూ అతన్ని గురువా అని పిల్చేవాళ్లు. ఇక్కడ యూదాలో కూడ ఈ సందేహం వుంది. మత్తయి సువిశేషంలో క్రీస్తుని "గురువా" అని పిల్చేవాళ్ళు మంచి ఉద్దేశంలో పిల్వరు.

ప్రభువు యూదాతో నీవే నన్ను అప్పగిస్తావని నేరుగా చెప్పలేదు. "ఆమాట నీవే చెప్పావు" అన్నాడు. ఇది ఓ రకమైన అరమాయిక్ ప్రయోగం. సువిశేషంలో ఈ ప్రయోగం మళ్లామల్లా వస్తుంది. ఈ ప్రయోగం వచ్చినపుడల్లా ప్రశ్న అడిగిన వ్యక్షే ఆ ప్రశ్నలోని కార్యానికి బాధ్యుడవుతాడని భావం. యూదా క్రీస్తుని నిన్ను అప్పగించేది నేనా, నేను కాదుగదా అని అడిగాడు. క్రీస్తు ఈ కార్యానికి నీవే బాధ్యుడివి అని జవాబు చెప్పాడు. అనగా క్రీస్తుని అప్పగించేది యూదాయే అని భావం. ఇక్కడ యూదా తాను చేయబోయే కార్యాన్ని ఓ ప్రశ్నగా మలచి క్రీస్తుని అడిగాడు. క్రీస్తు నీ ప్రశ్నకు నీవు చేయబోయే పనే జవాబు అని సమాధానం చెప్పాడు. యూదా క్రీస్తూ ఇద్దరూ ఈ ప్రశ్నభావమూ సమాధానం భావమూ కూడ బాగానే అర్థం జేసికొన్నారు. ఈలా ప్రభువు యూదాను అతడు చేయబోయే ఫరోరకార్యాన్ని గూర్చి ముందుగా హెచ్చరించినా అతని మనసు కరగలేదు.

3. పాస్క భోజనం - 26, 26–29

అంత్యభోజనం క్రీస్తు శ్రమల ఘట్టంలో అతి ముఖ్యమైంది. దీనిలో చాల భావాలున్నాయి. ప్రస్తుతం కొన్నిటిని పరిశీలిద్దాం. ఈ భోజనాన్ని సూచిస్తూ ప్రభువు ఇంతకు ముందే రెండుసార్లు భోజనాలు వడ్డించాడ. అవి రెండూ కూడ రొట్టెలను అద్భుతంగా పెంచి ప్రజలకు ఆహారం పెట్టిన సందర్భాలే. అవి మత్తయి 14, 13– 21లోను 15,32-39 లోను వస్తాయి. ఈ రెండద్భుతాలు మల్లా ప్రభువు పూర్వం