పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా సమయం సమిూపించింది. దానికి ముందుగా నీ యింటిలో నా శిష్యులతో కలసి పాస్కవిందు భుజిస్తానని అతనితో చెప్పండి అన్నాడు–26,18. శిష్యులు వెళ్ళి గురువు చెప్పినట్లే చేసి విందు సిద్ధం జేసారు. ఈ పెద్దమనిషి యెవరో మనకు తెలియదు. కాని అతడు క్రీస్తు అనుచరుడై యుండాలి. ఇక్కడ ప్రభువు పల్కిన ఈ వాక్యంలో అతని రీవి, గాంభీర్యం కన్పిస్తాయి. క్రీస్తు గంభీరంగా ఆజ్ఞ యిచ్చాడు. శిష్యులు ఎదురు ప్రశ్న వేయకుండా వెంటనే వెళ్ళి అతడు చెప్పినట్లు చేసారు. అది వాళ్ళ విధేయతకు గుర్తు.

ఈ సందర్భంలో “సమయం” అంటే సిలువ మరణం. పూర్వవేదంలో యావే కడతీర్పు తీర్పేదినాన్ని "సమయం" అని పిల్చేవాళ్లు. అది రక్షణ సమయం. అలాగే యిక్కడ క్రీస్తు సిలువ మరణం ద్వారా మనకు రక్షణం లభిస్తుంది. కనుక ఇది కూడ రక్షణ సమయం. క్రీస్తు శిష్యులు కలసే విందు భుజిస్తారు. కాని భోజనానంతరం ఓలివ తోటలో శిష్యులు క్రీస్తు నుండి విడిపోతారు.

2. మాలో వొకడు - 26,20-25

ప్రభువు గురువారం సాయంత్రం యెరూషలేమలో శిష్యులతో విందు భుజిస్తున్నాడు. క్రీస్తు మిలో వొకడు నన్ను శత్రువులకు పట్టియిస్తాడని విచారంగా పల్మాడు. శిష్యులు చింతా క్రాంతులై ప్రభువా! ఆ పనిచేసేది నేనా నేనా అని గ్రుచ్చి గ్రుచ్చి అడిగార. ఇక్కడ "ప్రభువు" అనే పదం క్రీస్తు అధికారాన్నీ దైవశక్తినీ సూచిస్తుంది. ఆ పదాన్ని వాడ్డం ద్వారా శిష్యులు తమకు క్రీస్తునందు పూర్ణవిశ్వాసం వుందని తెలియజేసారు. "నాతో పాటు ఈ పాత్రలో చేయి మంచినవాడే నన్ను అప్పగిస్తాడు" అని క్రీస్తు జవాబు చెప్పాడు. ఈ వాక్యం కీర్తన 41,9 నుండి గ్రహింపబడింది. "నాతో పాటు పాత్రలో చేయిమంచడం" అంటే, కలసి భుజించడం, లేక సహపంక్తి భోజనం చేయడం. యూదులు భోజనం చేసేపుడు అందరూ కలసి ఒకే పాత్రలో వున్న కూరను రొట్లోతో అద్దుకొని తినేవాళ్లు. ఈలా కలసి భుజించినవాళ్లు మిత్రులౌతారు. కనుక నా మిత్రుడే నాకు కీడు చేస్తాడని క్రీస్తు పలికిన వాక్యానికి అర్థం. యూదా మిత్రద్రోహి.

ఈ సందర్భంలో ప్రభువు మనుష్యకుమారుని అప్పగించేవానికి అనర్ధం. అతడు పట్టకుండావున్నా బాగుండేది అన్నాడు - 26,24. ఇవి క్రీస్తు తీవ్రమైన హృదయ వేదనతో పల్కిన పల్కులు. ఓవైపు తన్ను గూర్చి ప్రవక్తలు ముందుగా నుడివినట్లే మనుష్యకుమారుడు చనిపోతాడు. తండ్రి అతనికి ఓ రక్షణ ప్రణాళికను సిద్ధం జేసియిచ్చాడు. క్రీస్తు దైవచిత్తానికి లొంగి ఆ ప్రణాళిక ప్రకారం చనిపోతాడు. కాని మరో వైపు ఈ మరణం యూదా ద్రోహం ద్వారా సంభవిస్తుంది. దానికి అతడు పూర్తిగా బాధ్యుడౌతాడు. అతడు ఈ ఫరోర