పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనడానికిచ్చే కొద్దిపాటి సొమ్ము మాత్రమే చెల్లించారు. ముప్పది వెండి కాసులు ఆ రోజుల్లో బానిసను కొనడానికి చెల్లించే సౌమ్మ అనగా శత్రువుల దృష్టిలో క్రీస్తు విలువలేని నిరుపేద బానిసలాంటివాడయ్యాడని భావం. మత్తయి యిక్కడ ఈ పూర్వవేద ప్రవచనాన్ని ఉదహరించడంలో ఉద్దేశం ఇదే. యూదా క్రీస్తుని శత్రువులకు పట్టియిస్తాడని పూర్వ వేదం ముందుగానే పేర్కొంది. తండ్రికి ఈ సంగతి ముందుగానే తెలుసు. కాని తండ్రి ఈ దుష్ట కార్యాన్నిగూడ మనకు రక్షణాన్నిచ్చే దాన్నిగా మార్చివేసాడు. అతడు చెడ్డనుండి కూడ మంచిని రాబట్టేవాడు.

ప్రధానార్చకుల నుండి సొమ్ము తీసికొన్నప్పటినుండి యూదా క్రీస్తుని అప్పగించడానికి "తగిన సమయం" కొరకు వేచివున్నాడు – 26, 16, ప్రభువు కూడ "తన సమయం" కొరకు కాచుకొని వున్నాడు – 26,18, ఈ సమయం క్రీస్తు శత్రువులకు అప్పగింపబడే సమయమే. కాని యూదా ముప్పది వెండి నాణాలకు ఆశపడి ఈ సమయం కొరకు వేచివున్నాడు. క్రీస్తు మాత్రం మానవుల రక్షణ కొరకు స్వీయ ప్రాణాన్ని ధారపోయడానికి ఇదే సమయం కొరకు కాచుకొని వున్నాడు. ఇద్దరి వద్దేశాల్లో ఎంత అంతరం!

ధనదాహం యూదాను నాశం చేసింది. ఆ దాహం నేడు మనలను కూడ కాల్చివేయవచ్చు. కనుక మన తరపున మనం జాగ్రత్తగా మసలుకోవాలి.

2. పాస్క విందు 26,17-85

ఈ ఘట్టంలో నాల్గంశాలున్నాయి. అవి 1) శిష్యులు పాస్క విందును సిద్ధం జేయడం - 26,17-19. 2) ప్రభువు యూదా ద్రోహాన్ని ముందుగానే తెలియజేయడం - 26,20-25. 3) అంత్యభోజనం - 26,26–29. 4) పేత్రు బొంకు - 26,30-35. ఇక ఈ నాల్గంశాలను సంగ్రహంగా పరిశీలిద్దాం.

1. శిష్యులు విందును సిద్ధం జేయడం 26,17-19

ఇక్కడ పేర్కొన్న సంఘటనం గురువారం జరిగింది. పాస్మోత్సవం యూదులకు అతి ప్రధానమైన పండుగ. అందరు భక్తి భావంతో ఆ దినం విందు భుజిస్తారు. కాని ఆ రోజు యూదులు పలియని రొట్టెలు మాత్రమే తినాలి. కనుక వాళ్లు ఆ ముందటి దినమే పలిసిన రొట్టెలను ఇండ్లలో నుండి తీసివేసేవాళ్లు ఈ పాస్మోత్సవం గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ఆ సాయంత్రమే ప్రభువు కడపటి విందు ఆరగించాడు.

శిష్యులు క్రీస్తుని అయ్యా! ఈ యేడు పాస్కవిందు ఎక్కడ తయారుచేయమంటారు అని అడిగారు. ప్రభువు వారితో మిరు నగరంలోని పలానా పెద్దమనిషి దగ్గరికి వెళ్ళండి.