పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోకంలో పురుషులతో పాటు స్త్రీలు కూడ ఎన్నో ఘనకార్యాలు చేసారు. ఐనా పురుషులు చేసిన సత్కార్యాలు చరిత్రలో కెక్మాయిగాని స్త్రీలు చేసిన మంచి కార్యాలు అలా యొక్కలేదు. అన్ని ప్రాచీన సమాజాలు కూడ పురుషాధిక్య సమాజాలు. కనుక అవి స్త్రీలను అశ్రద్ధ చేసాయి. కాని క్రీస్తు అలా చేయలేదు. నాడు ప్రభువులాగే నేడు మనం కూడ ఈ పుణ్యాత్మురాలిని తప్పక అభినందించాలి. ఇంకా, ఈ పాపపు లోకంలో నరులు చేసే సత్కార్యాలు చీకటిలో దీపంలాగ ప్రకాశిస్తాయి. ఇక్కడ ఈ పుణ్యకార్యం చేసి చూపించిన ఈ విశుద్ధమూర్తి నేడు మనం కూడ మంచి పనులు చేయాలని ప్రేరేపిస్తూంటుంది. విశేషంగా యూదా, ప్రధానార్చకులు చేసిన దుష్టకార్యంతో పోల్చి చూస్తే ఈ భక్తురాలు చేసింది ఎంతో పవిత్రకార్యం గదా!

3. యూదా ద్రోహం = 26,14-16

ఓ వైపు పై భక్తరాలు ప్రేమ భావంతో క్రీస్తుకి అభిషేకం చేస్తూండగా మరోవైపు యూదా ద్రోహబుద్ధితో ప్రభువుని అప్పగించడానికి పూనుకొన్నాడు. ఆమె యోగ్యురాలైన శిష్యురాలు. యూదా కూడ పన్నిద్దరు శిష్యుల్లో ఒకడు. కాని అయోగ్యుడైన శిష్యుడు. అతడు దుష్ట శిష్యులకు గురుతుగా వుంటాడు. నేడు కూడ మనం ఆ యూదాలాగే ప్రభువుకి ద్రోహం చేసే అపాయం లేకపోలేదు.

నేను యేసుని విూ కప్పగిస్తే విూరు నాకేమి యిస్తారని యూదా ప్రధానార్చకులను అడిగాడు - 26,15. ఈ వాక్యాన్ని బట్టి అతడు ధనలోభం వల్ల క్రీస్తుని పట్టి యిచ్చాడనుకోవాలి. ధనవాంఛ పనికిరాదని ప్రభువు ముందుగానే హెచ్చరించాడు. అతడు ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకోవద్దన్నాడు. మన సంపదలున్నచోటనే మన హృదయం వుంటుంది. కనుక మన సాత్తు ఎప్పుడూ పరలోకం లోనే వుండాలి. అప్పుడు మన మనసుకూడ పరలోకం విూదనే వుంటుంది - 6,19. ఇంకా, నరులు ఇద్దరు యజమానులను కొలవగూడదు. ఆ యిద్దరు యజమానులు దేవుడు ధనమూను - 6,24. పైగా శిష్యులు వెండిబంగారాల మిూద గాక దేవుని మిూదనే ఆధారపడాలి - 10,9. కాని యూదా ఈ బోధలన్నిటినీ పెడచెవిని బెట్టాడు.

యూదా మూరుడై అమూల్యమైన నిధిని పోగొట్టుకొన్నాడు. క్రీస్తే ఆ నిధి. ఆ నిధికి బదులుగా "ముప్పది వెండి నాణాలు" సంపాదించుకొన్నాడు. కాని వాటి విలువెంత? ఇక్కడ "వాళ్లు అతనికి ముప్పది వెండి నాణాలు ఇచ్చారు" అనే వాక్యం జకర్యా ప్రవచనంన 11,12 నుండి గ్రహింపబడింది. అక్కడ ఆ ప్రవక్త కొందరు అధికారులకు కాపరిగా కుదిరాడు. కాని ఆ యధికారులు ప్రవక్తను చిన్నచూపు చూచి అతనికి ఓ బానిసను