పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకా, యూదుల సంప్రదాయం ప్రకారం వారి రాజులు అభిషేకం పొందేవాళ్లు. ఇక్కడ క్రీస్తుకూడ ఓ రాజుగా అభిషేకం పొందాడు అనుకోవాలి. అభిషిక్తుణ్ణి హీబ్రూలో మెస్సీయా అంటారు. గ్రీకులో క్రీస్తు అని పిలుస్తారు. కనుక ఇక్కడ ఈ యభిషేకం ద్వారా యేసు మెస్సీయా అని అర్థం జేసికోవాలి.

ఈ భక్తురాలు క్రీస్తు శిరస్సుకి అభిషేకం చేయడం జూచి శిష్యులు కోపించారు. ఈలా ఈ పరిమళద్రవ్యాన్ని వ్యర్థం చేయడమెందుకు? దీన్ని విక్రయించి వచ్చిన సొమ్ముతో పేదలకు దానం చేయవచ్చు గదా అన్నారు. మార్కు రచన ప్రకారం ఈ ద్రవ్యం 300 దీనారాలు చేస్తుంది - మార్కు 14,9. ఆ రోజుల్లో కూలీలకు ఒకరోజు కూలికి ఒక దీనారం చెల్లించే వాళ్ల. అనగా ఒక శ్రామికునికి సంవత్సరం పొడుగునా వచ్చే ఆదాయమెంతో ఈ ద్రవ్యం ఖరీదు అంత! ఇది పెద్ద సొమ్మే ఈ భక్తురాలు హృదయంలోని ప్రేమభావంతో పెద్ద ఖరీదు చేసే పరిమళ ద్రవ్యాన్ని క్రీస్తు శిరస్సుపై కుమ్మరించింది. ప్రేమ వ్యయాన్ని లెక్కచేయదు కదా! ఆమె యెడదలో క్రీస్తుపట్ల ఎంత గాథానురాగం, ఎంత లోతైన భక్తిభావం వుందో ఎవరికి తెలుసు?

శిష్యులు ఆ పుణ్యాత్మురాలిని విమర్శించడం జూచి క్రీస్తు ఆమె కోప తీసికొన్నాడు. ఆమె చేసింది సత్కార్యం అని సమర్ధించాడు. శిష్యులు ఈ సామ్మ పేదలకు దానం చేయవచ్చు గదా అన్నారు. క్రీస్తు వాళ్ళకు ఈలా జవాబు చెప్పాడు. పేదలు ఎప్పడూ మన చుటూవుంటారు. వాళ్లకు మీరెప్పడైనా దానాలు చేయవచ్చు. నేను మాత్రం ఎల్లప్పుడు శారీరకంగా విూతో వుండను. నా మరణం సమిూపిస్తుంది. కనుక విూరు నాకేదైనా చేయదల్చుకొంటే ఇప్పడే చేయాలి. ఈమె నన్ను గౌరవిస్తూ, నా భూస్థాపనాన్ని సూచిస్తూ ఈ యభిషేకం చేసింది. విూరు ఆమెను మెచ్చుకోవాలి విమర్శించగూడదు అన్నాడు. ఇక్కడ ఈ పునీతురాలు చేసింది సత్కార్యం (గ్రీకు మూలంలో "రమ్యమైన" కార్యం.) క్రీస్తు మరణం సమిూపించిందని శిష్యులు గ్రహించకపోయినా ఈమె గ్రహించింది. అది ఆమె గొప్పతనం.

“పేదలు ఎల్లప్పడు విూతో వుంటారు" అనే వాక్యం ద్వితీయోపదేశకాండం 15,11లో వస్తుంది. పేదలను పట్టించు కోనక్కరలేదని ఈ వాక్యం భావం కాదు. ఈ భక్తురాలు క్రీస్తు పట్ల గల ప్రేమభావంచే యూదమతం విధించే లేపన కార్యాన్ని నిర్వహించింది. కనుక ఆమెను మెచ్చుకోవాలి అని మాత్రమే ఇక్కడ ఈ వాక్యం భావం.

కడన క్రీస్తు ఈ సువార్త ప్రచారంలోకి వచ్చిన తావులన్నిటిలోను ప్రజలు ఈ భక్తురాలు చేసిన పవిత్ర కార్యాన్ని ప్రశంసిస్తారు అని నుడివాడు - 26,13. ఇది చాల మంచివాక్యం. ప్రభువు చెప్పినట్లుగా ఈ పునీతురాలిని తప్పక కొనియాడవలసిందే. ఈ