పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానం లేదు. వాళ్లు పాస్కపండుగ సందర్భంలో క్రీస్తుని బంధించ కూడదనుకొన్నారు. కాని తర్వాత యూదా ద్రోహం వల్ల వాళ్లు వద్దనుకొన్నకాలంలోనే అతన్ని బంధించారు. క్రీస్తు తండ్రి చిత్తానికి లొంగేవాడు. ధర్మాన్ని నెరవేర్చేవాడు. రీవితో తన మరణానికి సంసిద్దుడయ్యేవాడు.

అతని శత్రువులైన సానెడ్రిసభ సభ్యులు వరప్రసాద ప్రబోధాన్ని పెడచెవిని బెట్టారు. క్రీస్తుపై పగబెంచుకొని అతన్ని వంచనతో నాశం చేయజూచారు. అతని మరణానికి సాధనమాత్రులయ్యారు. మనకూ మన పోకడలకూ ఆదర్శంగా వుండవలసింది ప్రభువు కాని ఈ దుపులు కాదు.

2. బెతానియాలో అభిషేకం 26,6-13

బెతానియా గ్రామంలో ఒక స్త్రీ క్రీస్తుకి అభిషేకం చేసిన ఉదంతం నాలు సువిశేషాల్లోను వస్తుంది. లూకా మాత్రం ఈ సంఘటనకు క్రీస్తు శ్రమలతో సంబంధం లేనట్లుగా చెప్పాడు. అతని సువిశేషంలో స్త్రీ పాపాత్మురాలు. తన పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి ఆమె క్రీస్తుని అభిషేకించింది. ప్రభువు ఆమె పాపాలను మన్నించాడు - లూకా 7,36-50.

మత్తయి సువిశేషంలో ఈ యభిషేకానికి క్రీస్తు శ్రమలకు సంబంధం వుంది. ఈ యభిషేకం క్రీస్తు భూస్థాపనాన్ని సూచిస్తుంది. మార్కుసువిశేషంలో పుణ్యస్త్రీలు క్రీస్తు దేహాన్ని లేపనం చేయడానికి పరిమళ ద్రవ్యాలు తీసుకొని వస్తారు - 16,1. కాని మత్తయి గ్రంథంలో ఆ పుణ్యస్త్రీలు ఈలా పరిమళ ద్రవ్యాలతో రారు. వాళ్లు వట్టినే సమాధిని చూడ్డానికి వచ్చారు – 28,1. కనుక మత్తయి గ్రంథంలో ఈ భక్తురాలే క్రీస్తు దేహానికి లేపనం చేస్తుంది. ఇక్కడ ఈమె పశ్చాత్తాప తపురాలుగా గాక, క్రీస్తు పట్ల అపారమైన ప్రేమగల భక్తురాలుగా చిత్రింపబడింది. ఈమె పేరేమిటో సువిశేషం చెప్పదు.

యూదులు భూస్థాపనం చేయకముందు మృతదేహాలకు లేపనం చేసేవాళ్ల. వాళ్ళ దృష్టిలో అది కరుణకార్యం, పవిత్రకార్యం. కనుక ఇక్కడ ఈ భక్తురాలు క్రీస్తు దేహానికి ఈ పవిత్రకార్యాన్ని నిర్వహించాలనుకొంది. ఈ కార్యం ద్వారానే ఆమె క్రీస్తు మరణాన్నీ భూస్థాపనాన్నీ సూచించింది. కాని ఈ సంఘటనలు ఆమెకు ముందుగానే ఏలా తెలిసాయి? అంతర్ దృష్టితో ఆమె క్రీస్తు కాలం సమిూపించిందని గుర్తించింద. క్రీస్తు మరణాన్ని పసికట్టింది. కనుక పరమ భక్తిభావంతో ఈ పవిత్రమైన అభిషేకాన్ని నిర్వహించింది.