పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు ఎవరివల్లనో నిర్బంధింపబడి, ఎవరికో లొంగిపోయి, చేతగానివాడి లాగ సిలువపై మరణించలేదు. ఆ ప్రభువు తన సిలువ మరణాన్ని తానే ముందుగానే నిర్ణయించుకొన్నాడు. కనుక మనుష్యకుమారుడు సిలువ మరణానికి అప్పగింపబడతాడు సుమా అని ముందుగానే రీవితో పల్మాడు. మరణ సంఘటనలు అతన్ని అదుపులోకి తీసికోవు. అతడే వాటిని అదుపులో వుంచుకొంటాడు.

ప్రభువు తన సిలువ మరణాన్ని గూర్చి శిష్యులను హెచ్చరించటం అది మొదటిసారి కాదు, నాల్గవసారి. ఇంతకు ముందే అతడు మూడుసార్లు ఈ యంశాన్ని ప్రస్తావించాడు. మత్తయి 16,21లోను 17,22లోను 17,19లోను ఈ ప్రస్తావనం వస్తుంద. కైసరయ ఫిలిప్పిలోపేత్రు తన్నుమెస్సియాగా ప్రకటించిన పిదప ప్రభువు నాలు పర్యాయాలు ఈ సంగతి చెప్పాడ. అనగా ఈ యంశం అతని మనసులో ఎప్పడూ మెదులుతూనే వుంది అనుకోవాలి. ప్రభువుకి తన సిలువమరణం ముందుగానే తెలుసు. ముందుగానే దాన్ని పరిపూర్ణంగా అంగీకరించాడు కూడ. అతనికి ముందుగా తెలిసినట్లే శ్రమల ఘట్టంలోని సంఘటనలన్నీ జరిగిపోయాయి.

యూదుల ప్రధానార్చకులు పెద్దలు ప్రధాన యాజడైన కైఫాయింట సభ దీర్చారు - 26,3. ఈ సభకు సానెడ్రిన్ అని పేరు. దీనిలో 72 మంది సభ్యులుంటారు. యూదుల మత విషయాల్లో ఈ సభ మన సుప్రీం కోర్టు లాంటిది. కనుక దాని నిర్ణయాలకు తిరుగులేదు.

ఈ సభ సభ్యుల పన్నాగాలు మొదటినుండీ వంచనతోను కుట్రతోను కూడివున్నాయి. కనుకనే వాళ్లు యేసుని దొంగచాటుగా బంధించి చంపాలనుకొన్నారు. క్రీస్తుకి కొండంత ప్రజాదరణం వుంది. అతని అద్భుతాలు బోధలు అతనికి ఎందరో అభిమానులను సంపాదించి పెట్టాయి. అలాంటివాణ్ణి బహిరంగంగా బంధిస్తే ప్రజలు వూరుకోరు. అల్లరిచేస్తారు. విప్లవం లేవదీస్తారు. పాస్కతిరునాళ్ళలో యెరూషలేము గలిలయ యాత్రికులతో క్రిక్కిరిసి వుంటుంది. వాళ్ళల్లో చాలమంది క్రీస్తంటే పడిచస్తారు. క్రీస్తుని బహిరంగంగా బంధిస్తే వీళ్ళను రెచ్చగొట్టినట్లే. విప్లవాన్ని కొని తెచ్చుకొన్నట్లే. కనుక సానెడ్రిన్ సభ్యులు యేసుని పాస్కతిరునాళ్ల ముగిసాక రహస్యంగా బంధించాలని కుట్ర పన్నారు.

ఇక్కడ క్రీస్తు రీవికి సానెడ్రిన్ సభ్యుల దొంగబుద్ధికీ వున్న వ్యత్యాసాన్ని చక్కగా గమనించాలి. క్రీస్తు స్వీయ మరణాన్ని గూర్చి తన శిష్యులతో బహిరంగంగా మాట్లాడితే, ఈ సభ్యులు అదే అంశాన్ని గూర్చి చాటుమరుగ్గా మాట్లాడారు. క్రీస్తుకి భవిష్యత్ జ్ఞానం వుంది. అతనికి తన మరణం ఎప్పడు వస్తుందో ఏలా వస్తుందో తెలుసు. సభ్యులకు ఆ