పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2.క్రీస్తుశ్రమలు

మనవిమాట

ఈ గ్రంథం క్రీస్తు శ్రమలనూ మరణాన్నీ వివరిస్తుంది. దీన్ని పూర్వమే బైబులు భాష్యం 109-111 సంచికల్లో ప్రచురించాం.

ఈ పొత్తం మత్తయి 26-27 అధ్యాయాల మీద వ్యాఖ్య క్రీస్తుశ్రమల విషయంలో మత్తయి చెప్పని అంశాలేవీ మార్కు చెప్పలేదు. లూకా కొన్ని ప్రత్యేకాంశాలు చెప్పాడు. వాటిని కాలక్రమ పద్ధతిలో ఈ గ్రంథంలో చేర్చాం. ఇక, యోహాను చాల ప్రత్యేకాంశాలు చెప్పాడు. కాని అవి తొలి మూడు సువిశేషాలు చెప్పిన పద్ధతిలో కాక ప్రత్యేకరీతిలో వుంటాయి. కనుక యోహాను చెప్పిన అంశాలను కట్ట కడన, 8వ అధ్యాయంలో చేర్చాం, ఈ విధంగా ఇది క్రీస్తు శ్రమల మీద సంపూర్ణ వ్యాఖ్య ఔతుంది.

ప్రాచీన క్రైస్తవులు క్రీస్తు పాటులను భక్తితో మననం చేసికొన్నారు. ప్రభువు పాటల ధ్యానం మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. మన మనస్సుని ఐహిక వ్యామోహాల నుండి మరల్చి పరలోక విషయాల మీదికి త్రిప్పతుంది. మన ప్రజలు సంవత్సరం పొడుగునా, విశేషంగా తపస్సు కాలంలో, ప్రభువు శ్రమలను ధ్యానం చేసికోవడానికి ఈ పొత్తం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

పాఠకులు ఈ గ్రంథంలోని ఆయా అధ్యాయాల ఆరంభంలో వచ్చే అవలోకనాలను మొదట అవధానంగా సువిశేషాలనుండే చదువు కోవాలి. ఆ పిమ్మటనే ఈ వ్యాఖ్యను చదవాలి. లేకపోతే ఈ వివరణం అర్థం కాదు. ఇది మూడవ ముద్రణం.

విషయ సూచిక

1. క్రీస్తు తన శ్రమలను ముందుగానే తెలియజేయడం 80
2. పాస్క విందు 85
3. గెత్సెమని 9.
4. న్యాయసభ తీర్పు 98
5. పిలాతు తీర్పు 109
6. క్రీస్తుని సిలువ వేయడం 117
7. భూస్థాపనం, కాపలా 131
8. యోహాను వర్ణించిన క్రీస్తు శ్రమలు 138
1) పిలాతు తీర్పు 133
2) సిలువ మరణం 140