పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 7

1.యోహాను క్రీస్తు ఉత్థానాన్ని అతడు తండ్రివద్దకు తిరిగిపోవడాన్నిగా భావించాడు - వివరించండి.
2.క్రీస్తు మరణోత్థానాలు రెండూ కలసే మనలను రక్షిస్తాయి - వివరించండి.
3."కాని కడపటి ఆదాము జీవమిచ్చేప్రాణి అయ్యాడు” - 1 కొరి 15,45, వివరించండి.
4.క్రీస్తు ఉత్థానం మనకుకూడ ఉత్థానాన్ని సాధించి పెడుతుంది - ఏలాగో తెలియజేయండి.
5.ఈ లోకంలో మన ఉత్థాన జీవితపు బాధ్యతలు తెలియజేయండి.

అధ్యాయం - 8

1.క్రీస్తు మోక్షారోహణంతో అతని భౌతిక సాన్నిధ్యానికి మారుగా ఆధ్యాత్మిక సాన్నిధ్యం ప్రారంభమౌతుంది - వివరించండి.
2.క్రీస్తు మహిమ అతన్ని విశ్వసించే భక్తులకు గూడ సంక్రమిస్తుంది - ఏలాగో తెలియజేయండి.

అధ్యాయం - 9

1.పెంతెకోస్తు భావాలను వివరించండి.
2.ఉత్తాన క్రీస్తు మనకు ఆత్మను దయచేసే తీరును తెలియజేయండి.
3.ఆత్మ మనలను క్రీస్తు చెంతకు చేర్చే తీరును వివరించండి.
4.క్రీస్తు పాస్క కార్యాలన్నీ ఏలా ఏక సంఘటనమౌతాయో తెలియజేయండి.
5.అసలు మన క్యాతలిక్ సమాజంలోని ప్రజలకు ఆత్మను గూర్చి తెలుసా? నీ మట్టుకు నీకు ఆత్మను గూర్చిన అనుభవం ఏమైనా వుందా?

అధ్యాయం - 10

1.యోహాను సువిశేషంలో "ఎత్తబద్దం” అనే పదం క్రీస్తు రాజు అని యేలా తెలియజేస్తుందో వివరించండి.
2. క్రీస్తు రాజు అవే విషయాన్నిగూర్చిన పితృపాదుల బోధలను పేర్కొనండి.
3.క్రీస్తు ఏలా రాజౌతాడో తెలియజేయండి.