పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘటనం క్రీస్తుకి అన్వయిస్తుంది. "ప్రభువు దప్పికగొన్నవాడు నావద్దకు రావచ్చును. నన్ను విశ్వసించేవాడు దప్పిక తీర్చుకోవచ్చును. లేఖనం చెప్పినట్టు అతని (క్రీస్తు) అంతరంగంనుండి జీవజలనదులు ప్రవహిస్తాయి" అన్నాడు - యోహా 7,37-38. ఇక్కడ జీవజలం అంటే పవిత్రాత్మే ఈ యాత్మే క్రీస్తు హృదయంలోనుండి బయలుదేరుతుంది. భక్తుల హృదయాల్లోనికి ప్రవహిస్తుంది. ప్రభువు సిలువమీద వ్రేలాడుతుండగా అతని హృదయాన్ని ఈటెతో పొడిచి తెరచారు. ఈ హృదయంనుండి నీళ్ళూ నెత్తురూ కారాయి - యోహా 19,34 ఆ నీళ్ళ జ్ఞానస్నానాన్నీ ఆత్మనీ, ఆత్మ దయచేసే వరప్రసాదాలనూ సూచిస్తాయి. ఆ నెత్తురు దివ్యసత్రసాదాన్ని సూచిస్తుంది. ఇంకా, తెరువబడిన క్రీస్తు హృదయంనుండి తిరుసభకూడ పుట్టుకవచ్చింది. పూర్వం నిద్రపోయిన మొదటి ఆదాము ప్రక్కలోనుండి ఏవ ఉద్భవించింది. అలాగే మరల సిలువ మీద నిద్రించిన రెండవ ఆదాము క్రీస్తు ప్రక్కలోనుండి రెండవ ఏవలాగ తిరుసభ ఉద్భవించింది. ఈ తిరుసభ మనమే. ఈలా మోషే బెత్తంతో కొట్టిన రాతిబండ సిలువమీద తెరువబడిన క్రీస్తు హృదయానికి చిహ్నంగా వుంటుంది, ఆ బండనుండి నీళ్ళలాగే, క్రీస్తు హృదయంనుండి నీళ్ళూ నెత్తురూ వెలువడ్డాయి. సిలువమీద తెరవబడిన క్రీస్తు హృదయం అతని గాఢ ప్రేమకు చిహ్నంగా వుంటుంది. ప్రాచీన కాలంలోనే బోనవెంచరు భక్తుడు ఈలా నుడివాడు. "ఈటెతో పొడవడం వల్ల క్రీస్తు హృదయం గాయపడింది. ఈ గాయం మన కంటికి కన్పిస్తుంది. కాని మన కంటికి కన్పించే ఈ గాయం మన కంటికి కన్పించని శ్రీ హృదయ ప్రేమగాయానికి గుర్తుగా వుంటుంది".

2. హృదయం ప్రేమకు సంకేతం

తిరుహృదయ భక్తిసాధనంలో మనం ఆరాధించేది ఆ ప్రభువు ప్రేమనే. అతని భౌతిక హృదయం ఈ ప్రేమకు చిహ్నంగా వుంటుంది. కనుక మనం అతని హృదయాన్ని ఆరాధిస్తాం. ఈ హృదయం అతని రక్తమాంసాలతో కూడింది. అతని ప్రేమకు తార్మాణంగా వుండేది. ఇక, మన తరపున మనం క్రీస్తుకి బదులు ప్రేమ చూపడం గూడ తిరుహృదయ భక్తిలో ఓ భాగమే. ఎప్పడుకూడ ఈ భక్తి దేవుడు మానవునిపట్ల ప్రేమజూపడం, మానవుడు దేవుని పట్ల ప్రేమజూపడం అనే రెండంశాలతో కూడి వుంటుంది.

తిరుహృదయ భక్తిలో మనం క్రీస్తు మానుష హృదయాన్ని ఆరాధిస్తామని చెప్పాం. ఎందుకు? రెండు కారణాలనుబట్టి, మొదటిది, క్రీస్తు నరావతారంలో అతని మానుషదేహం