పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. తిరుహృదయం

తిరుహృదయం క్రీస్తు ప్రేమకు చిహ్నం. మన రక్షణమంతా దానిలో ఇమిడివుంది. మనం తిరుహృదయ భక్తిని పాటించినపుడు క్రైస్తవ పరిపూర్ణతనంతటినీ సాధించి నట్లవుతుంది. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. దేవుని ప్రేమ

తిరుహృదయం అంటే ప్రధానంగా భగవంతుని ప్రేమకథ. కనుక ఆ భగవంతుడు మనలను ప్రేమించేతీరును గూర్చి కొన్ని బైబులు ఆలోకనాలను పరిశీలిద్దాం. ప్రవక్తల బోధల ప్రకారం పూర్వవేదంలోని భగవంతుడు ఓ అమ్మానాన్నలాంటివాడు. "తల్లి తన ప్రేవున బుట్టిన బిడ్డను మరచిపోతుందా? తనశిశువును ప్రేమించకుండావుంటుందా? ఒకవేళ తల్లి తాను కనిన బిడ్డను మరచిపోతే పోతుందేమోకాని నేను మాత్రం మిమ్మ మరచిపోను - యొష 49,12 తండ్రి తన కుమారునిమీద కరుణజూపినట్లే ప్రభువు తనకు భయపడేవాళ్ళమీద జాలిచూపుతాడు" - కీర్త 108, 13. మానవులమైన మనకు తెలిసిన ప్రేమల్లో తల్లిదండ్రుల ప్రేమ ఉత్తమోత్తమైంది. పై బైబులు వాక్యాలు రెండూ భగవంతుడు అమ్మ నాన్నలలాంటివాడని తెలియజేస్తాయి. ఇంకా ప్రవక్తలు భగవంతుడు నరులపట్ల చూపే ప్రేమను భర్త భార్యపట్ల చూపే ప్రేమతో పోల్చారు. "నిన్ను సృజించిన ప్రభువే నీ భర్త, నేను ఒక్క క్షణం నిన్ను విడనాడాను, కాని యిప్పడు శాశ్వత కృపతో నిన్ను కరుణిస్తాను, కొండలు ජධිච්ජි కదలవచ్చుగాక, తిప్పలు తావుదప్పితే తప్పవచ్చు గాక, నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు" - యెష 545–10. పూర్వవేదంలోని భగవంతుని ప్రేమ ఇంత గాఢమైంది.

ఈ భగవంతుడు తన ఏకైక కుమారుడ్డి లోకంలోకి పంపాడు. "దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడ్డి ప్రసాదించాడు. ఆ కుమారుణ్ణి విశ్వసించే ప్రతివాడూ నాశం చెందక నిత్యజీవం పొందడానికే దేవుడు అలా చేసాడు" - యోహా 8,16. ఇక క్రీస్తు ప్రేమ తండ్రి ప్రేమకు ప్రతిబింబంగా వుంటుంది. కనుకనే అతడు "స్నేహితుల కొరకు ప్రాణాలు ధారపోసేవానికంటే ఎక్కువ ప్రేమ కలవాడెవడూ లేడు” అని వచించాడు - యోహా 15, 13.

సిలువమీద క్రీస్తు హృదయాన్ని ఈటెతో పొడిచి తెరచారు. ఈ సంఘటనం ఆ ప్రభువుకి మనమీదకల ప్రేమను పరిపూర్ణంగా వ్యక్తం చేస్తుంది. పూర్వం మెరీబా వద్ద మోషే రాతిబండను బెత్తంతో కొట్టగా నీళ్ళ వెలువడ్డాయి - సంఖ్యా 20,11. ఈ