పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి పైకెత్తబడినపుడు అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను" అన్నాడు - 12, 32-33. ఈ యెత్తబడ్డమే అతని సిలువ. సిలువే అతని సింహాసనం, సిలువ సింహాసనంమీది నుండి అతడు రాజుగా ఏలుతాడు, సిలువలో అతని మహిమ వెల్లడియౌతుంది. సిలువమీదినుండి అతడు అందరినీ తన దగ్గరికి ఆకర్షించుకొంటాడు. పౌలు భావాల ప్రకారం సిలువ క్రీస్తు దైన్యాన్ని సూచిస్తుంది. కాని యోహాను భావాల ప్రకారం, అది అతని మహిమను సూచిస్తుంది. ఇది పెద్ద భేదం. ఇక, క్రీస్తు సిలువమీది కెత్తబడ్డంతో పిశాచరాజ్యం కూలిపోయింది - యోహా 12,31. పిశాచరాజ్య పతనంతో క్రీస్తు రాజ్యం ప్రారంభమౌతుంది.

క్రీస్తునిసిలువవేసేటపుడు పిలాతు అతన్ని యధార్థంగా రాజుగా ప్రకటించాడు. అతడు "నజరేయుడైన యేసు, యూదులరాజు" అనే విలాసం వ్రాయించి సిలువ మీద పెట్టించాడు - 19,19.

ఈ రీతిగా నూత్నవేదంలో ప్రభువు, శిరస్సు, దావీదు వంశజుడు, ఎత్తబడ్డం మొదలైన పదాలు క్రీస్తు రాజని తెలియజేస్తాయి.

2. పిత్రుపాదుల బోధలు

క్రీస్తురాజు పండుగ 1925లో ప్రారంభమైంది, కాని క్రీస్తు రాజు అనే భావం ప్రాచీనకాలంనుండీ క్రైస్తవారాధనంలో కన్పిస్తుంది. ఈ యారాధనంలో రాజత్వమనేది ఒక బిరుదం కాదు, ఓ సంఘటనం. అనగా క్రీస్తు తన పాస్క కార్యాలద్వారా మహిమను పొంది అధికారాన్ని చేపట్టాడు. రాజుగా చలామణి అయ్యాడు.

తొలి శతాబ్దంలో వాడుకలోవున్న క్రీస్తు స్వరూపాలు కొన్ని దొరికాయి. వాటిల్లో అతడు రథసారథిగా, కర్ణధారిగా, కుడిచేతిని పైకెత్తిచూపించేవాడుగా కన్పిస్తాడు. ఈ భావాలన్నీ అతని రాజత్వాన్నిసూచిస్తాయి. తొలి రోజుల్లో నుండి క్రైస్తవులు అతన్ని రాజుగానే భావిస్తూ వచ్చారు అనడానికి ఇదొక తార్కణం.

పూర్వవేదంలోని దేవునికి "ఎల్ షడాయి” అని పేరు. సర్వశక్తిమంతుడు లేక మహోన్నతుడు అని ఈ హీబ్రూపదానికి అర్థం. అతనికి "దళాధిపతి" అని మరో పేరుకూడ ఉంది. ఈ పేర్లన్నీ పూర్వవేదప దేవుడు రాజు అని సూచిస్తాయి. ఇక క్లమెంట్, ఓరిజన్, అతనేష్యస్ మొదలైన తొలి శతాబ్దాల పితపాదులు ఈ పేర్లను క్రీస్తుకికూడా వాడారు. పూర్వవేదంలో యావేలాగే నూతవేదంలో క్రీస్తు కూడ సర్వశక్తిమంతుడు, రాజు అని భావం. అతడు సర్వసృష్టికి అధిపతి, సర్వాన్నీ తనలో ఇముడ్చుకొనేవాడు. పితృపాదులు క్రీస్తు తిరుసభను ప్రత్యక్షంగా తన ప్రభావంతో నింపుతాడని చెప్పారు. ఆ తిరుసభద్వారా విశ్వాన్ని పరోక్షంగా తన శక్తితో నింపుతాడని చెప్పారు.