పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. బైబులు బోధలు

1. శిష్యుల తొలినాటిబోధ అపోస్తలుల చర్యల్లో కన్పిస్తుంది. ఈ గ్రంథం ఉత్తానక్రీస్తుని "ప్రభువు" అని పేర్కొంటుంది. ఈ పదంలోనే అతడు రాజు అనే భావం కూడ యిమిడివుంది. పేత్రు యెరూషలేములో ప్రసంగిస్తూ "మీరు సిలువమీద చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు" అన్నాడు - అచ 2,36. క్రీస్తు ఉత్దానమై తండ్రి కుడిపార్వాన్ని చేరుకొని ప్రభువయ్యాడు.

యావే పూర్వవేదంలో యిస్రాయేలు ప్రజలకు ప్రభువు. అనగా అతడు వారికి దేవుడు, రాజుకూడ నిబంధనం ద్వారా అతడు వాళ్ళకు ప్రభువయ్యాడు. ఇప్పడు నూత్నవేద ప్రజలకు తండ్రికి మారుగా క్రీస్తు ప్రభువౌతాడు. అనగా అతడు వాళ్ళకు దేవుడూ రాజూ ఔతాడని భావం. ఉత్తానంనుండి అతని రాజ్యం ప్రారంభమౌతుంది, అంతందాకా అతడు తిరుసభలో పరిపాలనం చేస్తాడు.

2. పౌలు క్రీస్తుకి "శిరస్సు" అనే మాట వాడాడు. ఈ సందర్భంలోనే రాజు అనే భావంకూడ ఇమిడి వుంది. దేవుడు సమస్తమూ క్రీస్తు పాదాలక్రింద వుంచాడు. సమస్తానికీ శిరస్సుగా అతన్ని తిరుసభకు అనుగ్రహించాడు. ఆ తిరుసభ క్రీస్తు శరీరం - ఎఫె 1, 22-23. కావున సమస్త సృష్టికీ, తిరుసభకీ క్రీస్తు శిరస్సు శిరస్సుగానే అతడు తన మరణోత్తానాలనే పాస్మకార్యాలద్వారా తిరుసభను పవిత్రం చేస్తాడు. ఇక్కడ శిరస్సు అంటే నాయకుడు, అధిపతి అనే అర్థం. కనుక రాజు అనికూడ భావం. క్రీస్తు ఆధిపత్యం ప్రత్యక్షంగా తిరుసభమీద చెల్లుతుంది. మిగిలిన విశ్వం మీద పరోక్షంగా చెల్లుతుంది.

3. తొలి మూడు సువిశేషాలూ క్రీస్తుని దావీదు వంశజుణ్ణిగా పేర్కొంటాయి. అనగా అతడు దావీదు వంశంలో పట్టే రాజు, దేవుడు తండ్రియైన దావీదు సింహాసనాన్ని అతనికి అనుగ్రహిస్తాడు - లూకా 1, 32-33. అతడు దావీదు కుమారుడుగా రాజ్యం చేస్తాడు.

క్రీస్తు పిలాతు తన్ను రాజు అని పిల్వడానికి అంగీకరించాడు- మార్కు 15,2. కాని అతడు కైసరు చక్రవర్తితో పోటీపడేవాడు కాదు - లూకా 23,2. క్రీస్తు బుద్ధిపూర్వకంగానే ఆనాటి రాజకీయాలకు దూరంగా వుండిపోయాడు. ప్రజలు తన్ను రాజును చేయబోగా అతడందులకు అంగీకరింపలేదు - యోహా 6,15. అసలు అతడు లౌకికమైన రాజు కాడు.

4. నాల్గవ సువిశేషంలో యోహాను క్రీస్తుకి "ఎత్తబడ్డం" అనే పదం వాడాడు. ఈ శబ్దంలో అతడు రాజు అనే భావంకూడ ఇమిడివుంది. అతడు "నేను భూమిమీది