పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి పెంతెకోస్తు - అచ 2,33. మన పెంతెకోస్తు మన జ్ఞానస్నానమే. జ్ఞానస్నాన సమయంలోనే క్రీస్తు తన ఆత్మను మనమీద కుమ్మరిస్తాడు. తర్వాత భద్రమైన అభ్యంగనము పొందినపుడు ఈ యాత్మయింకా అధికంగా మనమీదికి దిగివస్తుంది. అసలు తొలిరోజుల్లో ఇవి రెండు ఒకే సంస్కారంగా వుండేవి. తరువాత వీటిని రెండుగా విడదీసారు.

3. ఆత్మ మనలను క్రీస్తు చెంతకు చేరుస్తుంది

ఉత్తాన క్రీస్తు మనకు ఆత్మనిస్తాడని చెప్పాం. ఆ యాత్మ మనలను మళ్ళా క్రీస్తు చెంతకు కొనిపోతుంది. మనం క్రీస్తుని దేవుణ్ణిగా అంగీకరించేలా చేస్తుంది. అతన్ని విశ్వసించి ప్రేమించేలా చేస్తుంది. క్రీసు బోధలను, విశేషంగా అతని మరడోత్థానాలను అర్థంచేసికొనేలా చేస్తుంది. ఆ క్రీస్తుని మనకు ప్రత్యక్షం చేస్తుంది. ఈ భావాలను పరిశీలిద్దాం.

ఎవడైనా నా వద్దకు రావాలి అంటే నా తండ్రి అతణ్ణి ఆకర్షించాలి అన్నాడు క్రీస్తు - యోహా 6,44. ఈ వాక్యంలో "ఆకర్షణం" అంటే ప్రేమే. ఈ ప్రేమే పరిశుద్ధాత్మ కనుక తండ్రి పరిశుద్దాత్మద్వారా భక్తులను క్రీస్తువద్దకు రాబడుతూంటాడు. అనగా తండ్రి కోర్కెప్రకారం ఆత్మ ప్రజలను క్రీస్తు చెంతకు లాగుకొని వస్తూంటుంది. ఆత్మ మనలను తన చెంతకుగాదు, క్రీస్తు చెంతకు రాబడుతుంది. ఆ యాత్మడు అంత నిస్స్వార్థపరుడు.

పవిత్రాత్మవలన తప్ప ఎవడుకూడ యేసే ప్రభువు అని అంగీకరింపలేడు అన్నాడు పొలు - 1 కొ12,3. ఈ వాక్యంలో "ప్రభువు" అంటే రాజుకాదు, దేవుడు, క్రీస్తు దేవుడు అని విశ్వసించే శక్తి మనకు ఆత్మవలన కాని కలుగదు. ఆ రోజుల్లో రోమను ప్రజలు కైసరు చక్రవర్లే ప్రభువు (దేవుడు) అని చెప్తున్నారు. కాని క్రైస్తవులు ఆ వాదాన్ని ఖండించారు. మా ప్రభువు (దేవుడు) కైసరుగాదు క్రీస్తే అన్నారు. అందుకు వాళ్ళ వేదసాక్షులుగా మరణింపవలసి వచ్చింది. సరే, ఆ తొలినాటి క్రైస్తవులకు యేసుని దేవుణ్ణిగా అంగీకరించే శక్తిని ప్రసాదించింది ఎవరు? ఆత్మే. నేడు మనకూ అంతే. "యేసే ప్రభువు" అనే పైవాక్యం పౌలునాడు ఓ చిన్న విశ్వాస సంగ్రహంగా వాడుకలో వుండేది.

పరిశుద్ధాత్మ తన్ను గూర్చి బోధిస్తుంది అన్నాడు క్రీస్తు - యోహా 16,13-14 ఆత్మ క్రీస్తు బోధలను మళ్ళా విప్పి చెప్తుంది. శిష్యులు తమంతట తాము యేసు బోధలను అర్థం చేసికోలేరు. ఆత్మ మళ్ళా విప్పి చేస్తేనేగాని అవి వాళ్ళకు బోధపడవు. విశేషంగా క్రీస్తు మరణిత్తానాలు చాల ముఖ్యమైనవి. అవి అతని జీవితంలో జరగబోయే ప్రధానాంశాలు. కనుక ఆత్మప్రభువు మరడోత్థానాల భావాన్ని శిష్యులకు తెలియజేస్తుంది. అలా తెలియజేసి వాళ్ళను "సంపూర్ణ సత్యంలోనికి" నడిపిస్తుంది. బైబుల్లో సత్యమంటే