పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. క్రీస్తు ఉత్తానం

క్రీస్తు తన సిలువ మరణం ద్వారా మాత్రమే కాక, ఉత్తానంద్వారా కూడ మనలను రక్షిస్తాడు. ఈ యధ్యాయంలో నాలుగంశాలు పరిశీలిద్దాం.

1. ఉత్తానంద్వారా క్రీస్తు తండ్రిచెంతకు తిరిగిపోతాడు

ఆదాము పాపంద్వారా నరజాతి తండ్రి యింటినుండి వెళ్ళిపోయింది. మనమంతా తండ్రి కోపానికి గురయ్యాం. ఐనా అతడు దయతో మనలను మళ్ళా తన చెంతకు చేర్చుకోగోరాడు. కాని పాపపు మానవుడు దేవుని సన్నిధిని చేరుకోవడం ఏలా? కనుకనే తండ్రి క్రీస్తుని పంపాడు. అతనివెంటబోయి మనం మళ్ళా దేవుని యింటిలో అడుగుపెట్టవచ్చు. ఈ క్రీస్తు పాపానికి లొంగకుండానే పాప ఫలితాలకు గురయ్యాడు. తాను మన పాపపు దేహాన్ని చేకొన్నాడు. ఆ బలహీనప శరీరంతో చనిపోయి మహిమాన్విత శరీరంతో ఉత్థానమయ్యాడు. ఉత్తానంద్వారా అతడు పాపపు నరదశనుండి పవిత్రమైన దైవదశకు చేరుకున్నాడు. మరణం నుండి లేచిన క్రీస్తు మరల మరణించడు. ఇకమీదట మృత్యువుకి అతనిమీద ఎలాంటి శక్తీలేదు, అతని మరణం పాపానికి శాశ్వతమైన మరణం, ఇప్పడు అతడు దేవుని కొరకు దివ్య జీవితం జీవిస్తున్నాడు - రోమా 6,9-10.

యోహాను క్రీస్తు ఉత్తానాన్ని అతడు తండ్రి వద్దకు తిరిగిపోవడాన్నిగా భావించాడు. "యేసు తాను ఈ లోకాన్ని వీడి తండ్రి చెంతకు వెళ్ళవలసిన గడియ సమీపించిందని యెరిగి ఈ లోకంలో వున్న తనవారిని చివరిదాకా ప్రేమించాడు” - 13,1. ఈ వాక్యాన్నిబట్టి క్రీస్తు ఉత్తానమంటే అతడు తండ్రివద్దకు తిరిగిపోవడమే కదా!

యోహాను భావాల ప్రకారం క్రీస్తు ఉత్థానం క్రొత్త నిర్గమనం లాంటిది. పూర్వం మోషే పూర్వవేదపు ప్రజలను వెంటబెట్టుకొని పాపపు దేశమైన ఐగుప్తనుండి పవిత్రమైన వాగ్దత్తభూమికి వెడలిపోయాడు. ఆలాగే క్రీస్తుకూడ నూత్నవేద ప్రజలను వెంటబెట్టుకొని పాపమూ ద్వేషమూ మృత్యువుతో కూడిన ఈ లోకంనుండి తండ్రి సామ్రాజ్యానికి వెడలిపోయాడు. యోహాను సువిశేషం క్రీస్తు “మరణించాడు” అనడానికి బదులుగా అతడు తండ్రివద్దకు "వెళ్ళిపోయాడు" అంటుంది. “తాను దేవునివద్దనుండి వచ్చితిననియు మరల దేవుని వద్దకు వెళ్ళిపోవలసి వున్నదనియు యేసు యెరిగెను" అన్న వాక్యంలో ఈ ప్రయోగం కన్పిస్తుంది - 13,3. ఈ వెళ్ళిపోవడం పూర్వం యూదులు ఐగుప్తనుండి వెళ్ళిపోవడాన్ని