పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యం నిర్మించుకొంది. అనగా అతన్ని లొంగదీసికొంది. ఇప్పడు క్రీస్తుకూడ దేహధారి అయ్యాడు. దేహధారిగానే పిశాచాన్ని ఓడించాడు. అనగా ఏ మానుష దేహాన్ని ఆధారంగా జేసికొని పిశాచం పూర్వం విజయం సాధించిందో ఆ మానుష దేహంవలననే ఇప్పడు పరాజయం పొందింది. తన స్థలంలోనే తాను ఓటమికి గురైంది. ఈలా ఓడిపోయిన పిశాచం ఇక మనకు నాయకుడు కాదు. అతనికి మనం దాసులంగాము. మన ప్రభువు ఇక ఉత్థాన క్రీస్తే.

8. వరప్రసాద ప్రదానం, ప్రభువు సిలువమరణం ద్వారా మనకు పాపపరిహారం చేసాడు. అనగా మన పాపం తొలగింపబడింది. పాపం తొలగిపోగా మనకు వరప్రసాదం లభిస్తుంది. ఉత్థాన క్రీస్తు తనకు విధేయులయ్యేవాళ్ళందరికి నిత్యరక్షణకారకుడయ్యాడు -హెబ్రే 5,9. ఉత్తానక్రీస్తు వరప్రసాదం అతనిలోనికి ఐక్యమయ్యే భక్తుల్లోకి ప్రసరిస్తుంది. చెట్టులోని సారం కొమ్మల్లోకి ప్రసరిస్తుంది. శిరస్సులోని ప్రాణం అవయవాల్లోకి ప్రసరిస్తుంది. అలాగే క్రీస్తు వరప్రసాదం మనలోకి ప్రసరిస్తుంది. సూర్యుడు ప్రపంచానికంతటికీ వెలుగును ప్రసాదిస్తాడు. ఉత్తానక్రీస్తు ప్రజలందరికీ వరప్రసాదాన్ని ప్రసాదిస్తాడు. ఈ వరప్రసాదం తిరుసభ ద్వారా దేవద్రవ్యానుమానాలద్వారా మనలను చేరుతుంది.

ప్రార్థనా భావాలు

క్రీస్తు శ్రమలవల్లా మరణంవల్లా మనకు వరప్రసాదం సిద్ధిస్తుంది అని చెప్పాం. కాని ఈ వరప్రసాదాన్ని మన దాన్నిగా చేసికోవాలి. చెట్టమీది పండు కోసికొంటే మనమౌతాయి. అంగటిలోని మిఠాయి కొనుక్కుంటే మనదౌతుంది. నదిలోని నీళ్ళు మంచుకొంటే మనమోతాయి. అలాగే క్రీస్తు శ్రమల ఫలితాన్ని కూడ మనం రాబట్టుకొంటేనే అతని వరప్రసాదం మనకు లభించేది. కాని మనం క్రీస్తు శ్రమల ఫలితాన్ని ఏలా రాబట్టుకోగలం?

1. మనం ప్రభువు శ్రమలను ధ్యానం జేసికోవాలి. పౌలు అంతటివాడు క్రీస్తు శ్రమల్లో పాలుపొంది అతని పునరుత్థాన బలాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అనుకొన్నాడు - ఫిలి 3,10. కనుకనే అర్చ్యశిషులు చాలమంది క్రీస్తు పాటలను భక్తిభావంతో ధ్యానించుకొన్నారు. 8 భక్తికార్యం ద్వారా మనం భక్తిమంతమైన జీవితం జీవించవచ్చు శోధనలను ఎదుర్కోవచ్చుగూడ, ఈ సందర్భంలో పదునాల్గస్థలాల ప్రార్ధనం చేసికోవడం చక్కని భక్తిమార్గం.