పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2. నూత్ననిబంధన. పూర్వవేదంలో యావే ప్రభువు యిస్రాయేలీయులకు దాస్యవిముక్తి కలిగించి, సీనాయికొండ దగ్గిర వాళ్ళతో నిబంధనం చేసికొన్నాడు. ఆ నిబంధనం ఫలితంగా అతడు వాళ్ళ కొలిచే దేవుడయ్యాడు. వాళ్ళు అతడు కాచికాపాడే ప్రజలయ్యారు. ఈ సందర్భంలో పూర్వవేదం “నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు" అనే వాక్యం ఉదాహరిస్తుంది. ఇక నూత్నవేదంలో క్రీస్తు సిలువ మరణం క్రొత్త నిబంధనమౌతుంది. ఈ సిలువమరణం ద్వారా అతడు మనం కొల్చే దేవుడౌతాడు. మనం అతడు కాచి కాపాడే ప్రజలమౌతాం. కనుకనే క్రీస్తు అంత్యభోజన సమయంలో "ఇది నూత్ననిబంధనపు నా రక్తం" అన్నాడు - మత్త 26,28.

ఇదే సందర్భంలో యెషయా ప్రవక్త వర్ణించిన బాధామయ సేవకుణ్ణిగూడ పేర్కొనాలి. ఇతడు తన శ్రమల ద్వారాను మరణంద్వారాను ప్రజలకు పాపవిమోచనం కలిగించాడు - యెష53, 11-12.ఇక నూత్నవేదం పలుతావుల్లో క్రీస్తే ఈ బాధామయ సేవకుడని సూచిస్తుంది. ఈ సేవకుని ద్వారా మనకు విమోచనం కలిగిందని వాకొంటుంది - అచ 2,27, మార్కు 10,45.

3. మన ప్రతినిధిగా క్రీస్తు మనకొరకు మరణించాడు అన్నాడు పౌలు - 1 కొ 15,3. ఇక్కడ “మన కొరకు” అంటే మన స్థానంలో అని అర్థంగాదు. అనగా మనం పాపులమూ వధారులమూ ఐ యుండగా అతడు మన స్థానంలో చనిపోయి మనలను ప్రాణాలతో బ్రతకనిచ్చాడని అర్థం చెప్పగూడదు. మరి, అతడు మన తరపున, మన ప్రతినిధిగా చనిపోయాడని అర్థం చెప్పాలి. అనగా అతడు మనలను తనలో ఇముడ్చుకొని చనిపోయాడ.కనుకనే అతని మరణం మనలను రక్షించగలిగింది. అతడు దేవునికీ నరులకీ మధ్య పనిచేసే ఏకైక మధ్యవర్తి - 1 తిమొు 2,5. ఆ మధ్యవర్తి మరణంవల్ల మనం బ్రతికిపోయాం. ఫలితార్థమేమిటంటే, క్రీస్తు మన ప్రతినిధిగా చనిపోయాడుగాని మన స్థానంలో చనిపోలేదు.

4. నెత్తుటిద్వారా ప్రాయశ్చిత్తం, నెత్తురు పూర్వవేదంలో చాల పనులు చేసింది. అది నరుల పాపాలకు పరిహారం చేసింది. నరుల హృదయాలను శుద్ధిచేసింది. వాళ్ళను దేవునితొ ఐక్యపరిచింది.

ఐగుప్తలో యూదులు పాసుగొర్రెపిల్ల నెత్తురు తమద్వారబంధాలకు పూసికొన్నారు. దీనిద్వారా వాళ్ళ గృహాలు పవిత్రమయ్యాయి. ఆరాత్రి ఐగుప్తియుల ప్రథమ సంతానాన్ని చంపడానికి బయలుదేరిన దేవదూత, గొర్రెపిల్ల నెత్తురు పూసివున్న యూదుల ఇండ్లల్లో ప్రవేశింపనేలేదు - నిర్గ 12, 13. ఇంకా, సీనాయికొండ దగ్గిర నిబంధనం