పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ధారపోస్తున్నాను అన్నాడు - యోహా 10, 17-18, స్వేచ్చాపూర్వకంగానే అతడు తన ఆత్మను తండ్రి చేతుల్లోనికి అర్పించుకొన్నాడు — లూకా 24,46. ఇంకా అతడు మనలను ప్రేమించి మనకొరకు ప్రాణత్యాగం చేసాడు-గల 220. స్నేహితుల కొరకు అనురాగంతో అసువు లొడ్డాడు - యోహా 15,13. ఈ రీతిగా క్రీస్తు స్వేచ్చగాను ప్రేమపూర్వకంగాను మన కొరకు చనిపోయాడు. మరణంద్వారా అతడు ఈ పాపపు లోకంనుండి సాగిపోయి పుణ్యప్రదమైన తండ్రి సాన్నిధ్యాన్ని చేరుకొన్నాడు. ఈ దృష్టితో చూస్తే అతని మరణం ఎంతో విలువైంది. పరమ పవిత్రమైంది. మనలను రక్షించడానికి అన్ని విధాల తగింది. యోగ్యమైన అతని మరణం నుండి జీవం పట్టుకవచ్చింది.

క్రీస్తు తండ్రి చిత్తానికి లొంగి చనిపోయాడు. మన పట్లగల ప్రేమచేగూడ చనిపోయాడు. కనుక విధేయాత్మకమూ ప్రేమపూరితమూ ఐన అతనిమరణం మనలను రక్షించింది. కావున శిక్షాత్మకమైన క్రీస్తు మరణం కాక, ఫలసిద్ధితో గూడిన క్రీస్తు మరణం మనకు ఉపయోగపడుతుంది.

3. సిలువ మరణం

కాని క్రీస్తు చనిపోతే చనిపోవచ్చుగాక, బాధలేని మామూలు మరణం మరణించవచ్చుగదా? సిలువమీూద అంత ఫనోరమైన, అంత కూరమైన మరణం మరణించడం దేనికి? ఇక్కడ యింకో విషయంకూడ గుర్తించాలి. సిలువ మరణం కూరమైంది మాత్రమే కాదు, నీచమైందికూడ. ప్రభువు సిలువమీద చనిపోయాడు గనుక ఇప్పడు ఆ సిలువ మనకు పవిత్రవస్తు వయింది. కాని క్రీస్తు నాడు దానికా పవిత్రత లేదు. ఆనాడు పరమ దుర్మార్డులనూ పెద్దపెద్ద బందిపోటు దొంగలనూ సిలువమీద కొట్టి చంపేవాళ్లు, హీబ్రూ సంప్రదాయం ప్రకారం "సిలువమీద చనిపోయేవాడు శాపగ్రస్తుడు' * - ద్వితీ 21.23. అది చాలా నీచమైన మరణం. మామూలు మరణాన్నిగాక, ఈలాంటి నీచాతినీచమైన సిలువ మరణాన్ని క్రీస్తు అంగీకరించాడు - ఫిలి2,8. అతడు ఇంత నీచమైన చావుకి పాల్పడ్డం దేనికి? అపార ప్రేమ తప్ప దీనికి మరో కారణం లేదు.

క్రీస్తు సిలువ కేవలం యాదృచ్ఛికమైంది కాదు. తండ్రి రక్షణ ప్రణాళికలోనే సిలువకూడ నిర్ణయింపబడింది. అది తండ్రి ఆజ్ఞ - యోహా 1431. క్రీస్తు పొందవలసిన జ్ఞానస్నానం-లూకా 12,50. కనుక క్రీస్తు సిలువద్వారాగాక మరొక మార్గంలో మనలను రక్షించడం పొసగదు.

సిలువమరణం క్రీస్తు వినయవిధేయతలకూ బాధలకూ ప్రబల సాక్ష్యం. దానిద్వారా అతడు ఎంత క్రిందిస్థాయికి దిగిపోవడానికి వీలుందో అంత క్రింది స్థాయికి